అక్కన్నపేట(హుస్నాబాద్): గ్రామాల్లో సమస్యల పరిష్కారానికి ఐదుగురు సభ్యులతో కూడిన కమిటీ వేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ స్థానిక ప్రజాప్రతినిధులకు సూచించారు. అక్కన్నపేట మండల కేంద్రంలో బుధవారం జరిగిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. అలాగే మండలస్థాయి అధికారుల సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ తేమ శాతం సరైన విధంగా ఉండి కూడా కొనుగోలు చేయలేకపోతే సమస్యలు వస్తాయన్నారు. కార్యక్రమంలో పీసీసీ జనరల్ సెక్రటరీ సౌజన్య, ఆత్మ కమిటీ చైర్మన్ ఐల్లయ్య, ఎంపీడీఓ బానోతు జయరాం, వివిధ గ్రామాల సర్పంచులు, అధికారులు పాల్గొన్నారు.
ధాన్యం కొనుగోళ్లు సక్రమంగా జరగాలి
ప్రతి గ్రామంలో
వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలి
మంత్రి పొన్నం ప్రభాకర్


