పట్టపగలే దోపిడీ పాడైన గ్యాస్‌పొయ్యిలు బాగుచేస్తామని నమ్మించి వృద్ధ మహిళ నుంచి బంగారం లాక్కొని పరారయ్యారు. వివరాలు 9లో u | - | Sakshi
Sakshi News home page

పట్టపగలే దోపిడీ పాడైన గ్యాస్‌పొయ్యిలు బాగుచేస్తామని నమ్మించి వృద్ధ మహిళ నుంచి బంగారం లాక్కొని పరారయ్యారు. వివరాలు 9లో u

Mar 26 2026 10:31 AM | Updated on Mar 26 2026 10:31 AM

పట్టపగలే దోపిడీ పాడైన గ్యాస్‌పొయ్యిలు బాగుచేస్తామని నమ్మించి వృద్ధ మహిళ నుంచి బంగారం లాక్కొని పరారయ్యారు. వివరాలు 9లో u

గురువారం శ్రీ 26 శ్రీ మార్చి శ్రీ 2026

ఇందిరమ్మ బిల్లులు వెంటనే చెల్లించాలి

అసెంబ్లీలో ఎమ్మెల్యే సునీతారెడ్డి

నర్సాపూర్‌: ఇందిరమ్మ ఇళ్లు నిర్మించుకుంటున్న పేదలకు బిల్లులను వెంటనే మంజూరు చేయాలని స్థానిక ఎమ్మెల్యే సునీతారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. అసెంబ్లీలో బుధవారం ఎమ్మెల్యే మాట్లాడుతూ... ప్రభుత్వం పేదలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయడంతో వారు నిర్మాణ పనులు చేపట్టారని, పలువురు బేస్‌మెంట్‌స్థాయి వరకు పూర్తయినా బిల్లులు చెల్లించడం లేదని వివరించారు.

దరఖాస్తు గడువు

పొడిగింపు

మెదక్‌ కలెక్టరేట్‌: షెడ్యూల్ట్‌ కులాలకు ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీ స్వయం ఉపాధి పథకాల దరఖాస్తు గడువును ఏప్రిల్‌ 2వ తేదీ వరకు పొడిగించినట్లు కలెక్టర్‌ ప్రతిమాసింగ్‌ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లాలోని 249 మంది లబ్ధిదారులకు స్వయం ఉపాధి కోసం సబ్సిడీ ద్వారా ఆర్థిక సహాయం అందించనున్నట్లు చెప్పారు. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దర ఖాస్తు చేసి హార్డ్‌ కాపీలను సంబంధిత ఎంపీడీఓలు, మున్సిపల్‌ కమిషనర్లకు అందజేయాలన్నారు. జిల్లాస్థాయి కమిటీ ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేస్తామన్నారు.

నేడు అఖిలపక్ష

సమావేశం

రామాయంపేట(మెదక్‌): గతంలో రద్దయిన రామాయంపేట నియోజవర్గాన్ని పునరుద్ధరించాలని డిమాండ్‌ చేస్తూ దశలవారీగా ఆందోళనకు అన్ని పార్టీలు సిద్ధమవుతున్నాయి. ఈమేరకు నియోజకవర్గ సాధన సమితి పేరిట ఒక కమిటీని ఏర్పాటు చేశారు. గురువారం సాధన సమితి ప్రత్యేక సమావేశం ప్రగతి రిసార్ట్‌లో నిర్వహించనున్నట్లు సమితి సభ్యులు తెలిపారు. రామాయంపేట నియోజవర్గ పునరుద్ధరణ విషయమై సమావేశంలో చర్చిస్తామని, అన్ని పార్టీల నాయకులు హాజరుకావాలని కోరారు. ఈమేరకు సమితి సభ్యులు తహసీల్దార్‌ రజనికి వినతిపత్రం అందజేశారు.

పనుల పురోగతిపై ఆరా

హవేళిఘణాపూర్‌(మెదక్‌): మండలంలోని అవుసులపల్లి శివారులో పోలీస్‌శాఖ నిర్మిస్తున్న పెట్రోల్‌ బంక్‌ పనులను ఏఎస్పీ మహేందర్‌ పరిశీలించి పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. పెట్రోల్‌ బంక్‌ ఏర్పాటు చేయడం ద్వారా స్థానికులకు సౌకర్యవంతంగా ఉంటుందన్నారు. ఆయన వెంట ఏఆర్‌ డీఎస్పీ రంగానాయక్‌, ఆర్‌ఎస్‌ఐ మహిపాల్‌, సిబ్బంది ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement