పుల్‌కల్(అందోల్): సింగూరు ప్రాజెక్టు వద్ద మంళవారం ఆక్టోపస్ దళాలు మార్చ్ ఫాస్టు నిర్వహించాయి. ఆపదకాలంలో ప్రాజెక్టును ఎలా సంరక్షించుకోవాలో సూచించారు. మూడేళ్ల క్రితం కూడా ప్రాజెక్టు వద్ద ఆక్టోపస్ దళాలు మార్చ్‌పాస్టు నిర్వహించారు.
పాలిసెట్‌కు
తుదిగడువు ఏప్రిల్ 20
జోగిపేట(అందోల్): పాలిసెట్ 2026 ప్రవేశ పరీక్షకు హాజరుకావాలనుకుంటున్న విద్యార్థుల ఏప్రిల్ 20వ తేదీ చివరి తేదీ అని జోగిపేట ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ ప్రిన్సిపాల్ ఎం.వీణ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. మే13న ప్రవేశ పరీక్ష ఉంటుందన్నారు. ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్‌లో డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ అనే మూడు బ్రాంచులు ఉన్నాయని తెలిపారు. ఈ పాలిటెక్నిక్ ప్రత్యేకంగా మహిళల కోసం మాత్రమేనని, ఇటీవల మా సంస్థకు చెందిన అధ్యాపకులు పాలిటెక్నిక్ చదువు గురించి అవగాహన పాఠశాలల్లో అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు.


