వడగండ్ల బీభత్సం | - | Sakshi
Sakshi News home page

వడగండ్ల బీభత్సం

Mar 25 2026 9:23 AM | Updated on Mar 25 2026 9:23 AM

నేల రాలిన పంటలు

నందిగామ గ్రామంలో

నేలకొరిగిన మొక్కజొన్న పంట

నిజాంపేట(మెదక్‌): మండల కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో మంగళవారం గాలివాన బీభత్సం సృష్టించింది. వడగండ్లతో చాలా వరకు పంట నష్టం వాటిల్లింది. ఉదయం నుంచి ఎండ తీవ్రత ఎక్కువగా ఉండగా.. సాయంత్రం ఒక్కసారిగా ఆకాశం మేఘామృతమైంది. సాయంత్రం కాగానే గాలి వాన బీభత్సం సృష్టించింది. దీంతో ఈదురు గాలులు వీస్తూ రాళ్ల వర్షం కురిసింది. ఈ వర్షానికి రోడ్లపై ఆరబోసిన మొక్కజొన్న ధాన్యం తడిసిపోవడంతో రైతులు ఆందోళన చెందారు. అలాగే ఈదురు గాలులకు మామిడికాయలు నేల రాలిపోయాయి. పలు గ్రామాల్లో మొక్కజొన్న పంట నేలకొరిగింది. అలాగే వరి పంటలో గింజలు రాలిపోయాయని రైతులు వాపోయారు. ప్రభుత్వం పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement