సక్రమంగా సన్న బియ్యం సరఫరా | - | Sakshi
Sakshi News home page

సక్రమంగా సన్న బియ్యం సరఫరా

Mar 26 2026 10:31 AM | Updated on Mar 26 2026 10:31 AM

తీపెక్కిన చెరుకు సీజన్‌ ఈసారి చెరుకు మరింత తీపెక్కింది.ఈ ఏడాది చెరుకు క్రషింగ్‌ సీజనుఆశాజనకంగా ముగిసింది. వివరాలు 8లో u

తీపెక్కిన చెరుకు సీజన్‌ ఈసారి చెరుకు మరింత తీపెక్కింది.ఈ ఏడాది చెరుకు క్రషింగ్‌ సీజనుఆశాజనకంగా ముగిసింది. వివరాలు 8లో u

కలెక్టర్‌ ప్రతిమాసింగ్‌

మెదక్‌ కలెక్టరేట్‌/కౌడిపల్లి(నర్సాపూర్‌)/వెల్దుర్తి(తూప్రాన్‌): పేదలకు ప్రభుత్వం అందిస్తున్న నాణ్యమైన సన్న బియ్యం సరఫరాను సక్రమంగా పంపిణీ చేయాలని కలెక్టర్‌ ప్రతిమాసింగ్‌ అధికారులను ఆదేశించారు. బుధవారం జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్‌ యార్డు సమీపంలో గల ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌ను ఆమె ఆకస్మికంగా సందర్శించారు. ఈసందర్భంగా మూడు నెలల బియ్యం సరఫరా గురించి ఆరా తీశారు. అలాగే రికార్డులతో పాటు బియ్యం నిల్వలను పరిశీలించారు. పెండింగ్‌ ఉన్న రేషన్‌న్‌షాపులకు త్వరగా బియ్యం సరఫరా చేయాలని ఆదేశించారు. ఎలాంటి అక్రమాలు చోటు చేసుకోకుండా అధికారులు సక్రమంగా ప్రజలకు బియ్యం పంపిణీ చేయాలన్నారు. కలెక్టర్‌ వెంట జిల్లా పౌర సరఫరాల సంస్థ మేనేజర్‌ జగదీష్‌, తహసీల్దార్‌ లక్ష్మణ్‌ బాబు, సంబంధిత అధికారులు ఉన్నారు. అంతకుముందు కౌడిపల్లి మండలంలోని వెల్మకన్న, కొట్టాల గ్రామాల్లో రేషన్‌షాపులను తనిఖీ చేసి స్టాక్‌ను పరిశీలించారు. మూడు నెలలకు సంబంధించి ఒకేసారి బియ్యం పంపిణీ చేస్తున్నామన్నారు. అలాగే వెల్దుర్తి కేజీబీవీని ఆకస్మికంగా సందర్శించారు. మెస్‌ నిర్వహణ, ఆహార పదార్థాల నాణ్యతను పరిశీలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement