ఇన్‌చార్జి ప్రిన్సిపాల్ సింహారెడ్డి
మెదక్‌జోన్: మెదక్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో టీఎస్‌కేసీ, కెరీర్ గైడెన్స్ అండ్ ప్లేస్మెంట్ సెల్ ఆధ్వర్యంలో ఎంఎస్‌ఎన్ ఫార్మసీ, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ కంపెనీలు మంగళవారం నిర్వహించిన జాబ్‌మేళా 21మంది ఎంపికయ్యారు. ఈ మేరకు ఇన్‌చార్జి ప్రిన్సిపాల్ సింహారెడ్డి ఓ ప్రకటనలో వెల్లడించారు. ఈ జాబ్‌మేళాకు మొత్తం 42 మంది అభ్యర్థులు హాజరుకాగా, ఆరుగురు ఎంఎస్‌ఎన్ కంపెనీకి, 15 మంది అమెజాన్‌కు ఎంపికై నట్లు చెప్పారు. కార్యక్రమంలో శ్రీనివాస్, వేణుగోపాల్‌రావు, కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.


