
పోషక ఆహారంతో సంపూర్ణ ఆరోగ్యం
ప్రతిజ్ఞ చేస్తున్న విద్యార్థులు
తూప్రాన్: సమతుల్య ఆహారంతో సంపూర్ణ ఆరోగ్యం పొందవచ్చునాని ఐసీడీఎస్ సూపర్ వైజర్ శివ కుమారి పేర్కొన్నారు. మంగళవారం పట్టణంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో పోషక ఆహారంపై 9, 10వ తరగతి విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు వ్యాసరచన, డ్రాయింగ్, స్పీచ్ కాంపిటీషన్ నిర్వహించారు. పోటీ పరీక్షలో గెలుపొందిన విద్యార్థులను అభినందించా రు. కిశోర బాలికలు తీసుకునే ఆహారంలో అన్ని రకా ల సమతుల్య ఆహారం తీసుకుంటేనే సరైన పోషణ లభిస్తుందని తెలిపారు. దీనితో పాటు వ్యక్తిగత పరి శుభ్రత, నిత్యం సుమారు 4లీటర్లకు అధికంగా మంచినీరు తాగాలని సూచించారు. అనంతరం విద్యార్థులతో పోషణకు సంబంధించిన ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయురా లు ఫ్లోరిన్, అంగన్‌వాడీ టీచర్లు శ్రీలత, ఉమా పాల్గొన్నారు.
ఐసీడీఎస్ సూపర్ వైజర్ శివకుమారి