
బస్సుల కోసం రోడ్డెక్కిన విద్యార్థులు
చిన్నశంకరంపేట(మెదక్): పాఠశాలల సమయానికి బస్సులు రాకపోవడంతో ఆగ్రహానికి గురైన విద్యార్థులు రోడ్డెక్కారు. సోమవారం మండలంలోని అంబాజిపేట ప్రధాన రహదారిపై రాస్తారోకో చేపట్టా రు. చిన్నశంకరంపేటలోని జెడ్పీ పాఠశాల, మోడల్ స్కూల్‌కు వెళ్లేందుకు రోడ్డుపై గంటపాటు వేచి ఉన్న బస్సు రా లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పాఠశాల సమయానికి బస్సులు నడపాలని డిమాండ్ చేశారు. రోడ్డుకు ఇరువైపులా భారీగా వాహనాలు నిలిచిపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులకు గు రయ్యారు. విషయం తెలుసుకున్న ఎస్‌ఐ నారాయణగౌడ్ పోలీస్ సిబ్బందితో వచ్చి విద్యార్థులు, వారి తల్లిదండ్రులను సముదాయించి రాస్తారోకో విరమింపజేశారు.