
మందులు అందుబాటులో ఉంచండి
కలెక్టర్ రాహుల్‌రాజ్
కొల్చారం(నర్సపూర్): ప్రజలకు సకాలంలో వైద్య సేవలు అందేలా చూడాలని కలెక్టర్ రాహుల్‌రాజ్ సిబ్బందిని ఆదేశించారు. ఆదివారం కొల్చారం,రంగంపేట ప్రాథమిక ఆ రోగ్య కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఓపీ రిజిస్టర్లు, సిబ్బంది హాజరుతో పాటు మ ందుల స్టాక్‌ను పరిశీలించారు. సీజనల్ వ్యాధుల కేసులు, వా టికి సంబంధించిన మందులు అందుబాటులో ఉన్నాయా..? అని ఆరా తీశారు. వ్యాధుల నియంత్రణ, పరిసరాల పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సబ్ సెంటర్‌లో అవసరమైన మందులు అందుబాటులో ఉంచాలన్నారు. సాధారణ ప్రసవాలను ప్రోత్సహించేలా అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. కలెక్టర్ వెంట వైద్యులు ప్రవీణ్ కుమార్, సిబ్బంది త దితరులు ఉన్నారు.