
ముందస్తు అనుమతి తప్పనిసరి
మెదక్ మున్సిపాలిటీ: దీపావళి సందర్భంగా జిల్లా పరిధిలో తాత్కాలిక టపాకాయల దుకాణాలు ఏర్పాటు చేసే వ్యాపారులు తప్పనిసరిగా ముందస్తు అనుమతులు తీసుకోవాలని ఎస్పీ డీవీ శ్రీనివాసరావు సూచించారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. ఇందుకు సంబంధించిన ఇతర వివరాలు, మార్గదర్శకాల కోసం సంబంధిత సబ్ డివిజనల్ పోలీస్ అధికారిని సంప్రదించాలన్నారు. అనుమతి లేకుండా దుకాణాలు ఏర్పాటు చేస్తే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాగే సైబర్ నేరాల విషయంలో ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండాలన్నారు. ఇటీవల జరుగుతున్న నేరాల గురించి ప్రస్తావించారు. లోన్‌యాప్ మోసాలు, జాబ్ ఫ్రాడ్స్, బిట్‌కాయిన్, క్రిఫ్టో కరెన్సీ ఇన్వెస్ట్‌మెంట్ మోసాలు ఎక్కువగా జరుగుతున్నాయని తెలిపారు. తక్కువ వడ్డీతో వెంటనే లోన్ ఇస్తామని చెప్పి కొన్ని యాప్‌లను ఉపయోగించి బ్లాక్ మెయిల్ చేస్తున్నట్లు చెప్పారు. సైబర్ మోసాలకు గురైన వారు వెంటనే హెల్ప్‌లైన్ 1930 నంబర్‌కు కాల్ చేయాలన్నారు.
ఎస్పీ డీవీ శ్రీనివాసరావు