
బాబ్బాబూ.. దరఖాస్తు చేసుకోండి
వ్యాపారులకు ఎకై ్సజ్ అధికారుల ఫోన్లు
నర్సాపూర్: ‘గతంలో మీరు వైన్ షాపు నిర్వహణ లైసెన్స్ పొందడానికి దరఖాస్తు చేశారు. ఈనెల 18 వరకు గడువు ఉంది.. అవకాశం ఉంటే ఈసారి సైతం దరఖాస్తు చేయండి’ అని ఎకై ్సజ్ అధికారులు వ్యాపారులకు ఫోన్లు చేస్తున్నారు. దసరా రోజు భారీగా దరఖాస్తులు చేస్తారనే నమ్మకంతో పండుగకు ముందే ప్రభుత్వం మద్యం టెండర్లకు నోటిఫికేషన్ జారీ చేసింది. రెండు వారాలుగా దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ కొనసాగుతున్నా.. వ్యాపారుల నుంచి ఆశించిన స్థాయిలో ఆదరణ లేదని తెలిసింది. దీంతో మండలస్థాయి అధికారులతో గతంలో దరఖాస్తు చేసిన వ్యాపారులకు ఫోన్లు చేయిస్తున్నారని పలువురు చర్చించుకుంటున్నారు. కాగా దరఖాస్తు రుసుం రూ. 3 లక్షలకు పెంచడం పట్ల పలువురు వ్యాపారులు విచారం వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయమై ఎకై ్సజ్ సీఐ గులాం ముస్తాఫాను వివరణ కోరగా.. మద్యం దుకాణాల లైసెన్స్ పొందడానికి దరఖాస్తు చేసుకునేందుకు తమ సిబ్బంది వ్యాపారులకు అవగాహన కల్పిస్తున్నారని చెప్పా రు. గతంలో దరఖాస్తు చేసిన వారిలో పలువురికి మద్యం వ్యాపారం పట్ల ఆసక్తి ఉండే అవకాశం ఉంటుందన్నారు. ఆసక్తి ఉందా..? లేదా..? తెలుసుకొని గడువు, తదితర వివరాలను తమ సిబ్బంది వివరిస్తున్నారని పేర్కొన్నారు.