వరద నష్టంపై ఆరా
● వరద నష్టం అంచనాకు వచ్చిన కేంద్ర బృందం సభ్యులు బుధవారం ఏడుపాయల దుర్గమ్మను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అర్చకులు, సిబ్బంది ఆలయ మర్యాదల ప్రకారం స్వాగతం పలికారు. ● నిజాంపేట మండలంలోని నందిగామ శివారులో కుంగిన బ్రిడ్జి నిర్మాణం, నస్కల్ గ్రామానికి వెళ్లే రహదారి పూర్తిగా వరదలకు కొట్టుకపోయింది. వీటిని కేంద్ర బృందం పరిశీలించింది. అలాగే మండలంలో దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. ● రామాయంపేట మండలంలోని పర్వతాపూర్ గ్రామ శివారులో భారీ వర్షాలకు దెబ్బతిన్న బ్రిడ్జిని, రోడ్డును పరిశీలించారు. శిథిలమైన రహదారి పక్కనే ఉన్న పంట చేలల్లో వేసిన ఇసుక మేటలను బృందం సభ్యులు పరిశీలించారు. రెవెన్యూశాఖతో పాటు పంచాయతీరాజ్, వ్యవసాయ శాఖ అధికారులు రోడ్డు పక్కనే నష్టానికి సంబంధించి ఏర్పాటుచేసిన బ్యానర్‌ను పరిశీలించిన సభ్యులు వాటిని నమోదు చేసుకున్నారు.
మెదక్ మండలం మక్తభూపతిపూర్ వెళ్లేరోడ్డు, తిమ్మానగర్ వద్ద కొట్టుకుపోయిన బ్రిడ్జిని, హవేళిఘణాపూర్ మండలం బ్యాతోల్ వద్ద కొట్టుకుపోయిన రోడ్డు, హవేళిఘణాపూర్ పెద్ద చెరువును కేంద్ర బృందం పరిశీలించింది. చెరువు కింద ఇసుక మేటలు పెట్టిన పొలాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. రైతులు, అధికారులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు.
మెదక్‌కలెక్టరేట్/హవేళిఘణాపూర్(మెదక్)/
రామాయంపేట/నిజాంపేట/పాపన్నపేట: ఆగస్టు చివరి వారంలో కురిసిన భారీ వర్షాలకు జరిగిన వరద నష్టాన్ని అంచనా వేసేందుకు కేంద్ర బృందం బుధవారం జిల్లాలో విస్తృతంగా పర్యటించింది. మొదటగా కలెక్టరేట్‌కు చేరుకున్న కేంద్రం బృందం సభ్యులు డాక్టర్ పొన్నుస్వామి, వినోద్ కుమార్, అభిషేక్ కుమార్, ఎస్‌ఎస్‌పింటులకు కలెక్టర్ రాహుల్‌రాజ్ స్వాగతం పలికారు. కలెక్టరేట్‌లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వరద నష్టం తీరును వివరించారు. అనంతరం క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా మండలాల్లో పర్యటించారు. వారి వెంట కలెక్టర్ రాహుల్‌రాజ్, అదనపు కలెక్టర్ నగేశ్, ఆర్డీఓ రమాదేవి, ఇతర అధికారులు ఉన్నారు.
జిల్లాలో కేంద్ర బృందం పర్యటన దెబ్బతిన్న రోడ్లు, పంటల పరిశీలన