
వ్యక్తిత్వ వికాసానికి క్రీడలు దోహదం
మెదక్‌జోన్: {MîSyýlË$ Ð]lÅMìS¢™èlÓ ÑM>-Ýë-°MìS, {MýSÐ]l$Õ„ýS-׿MýS$, ÔèæÈÆý‡ §éÆý‡$-ÉéŰMìS G…™èl-V>¯ø §øçßæ§ýl-ç³-yýl-™éĶæ$° yîlDK Æ>«§éMìS-çÙ¯ŒS A¯é²Æý‡$. ´ëuý‡Ô>ÌS {MîSyé çÜÐ]l*QÅ B«§ýlÓÆý‡Å…ÌZ º$«§ýl-ÐéÆý‡… hÌêÏ MóS…{§ýl…ÌZ° þ°Ä¶æ$ÆŠḥæ MýSâêÔ>Ë OOÐðl$§é¯]l…ÌZ °Æý‡Ó-íßæ…-_¯]l MýSºyîlz ´ùsîæ-ÌSMýS$ hÌêÏ ¯]lË$-Ð]lÊ-ÌSÌS ¯]l$…_ »êÌS, »êÍ-MýSË$ àf-Æý‡-Ķæ*ÅÆý‡$. Ð]l¬W…ç³# M>Æý‡Å{MýS-Ð]l*-°MìS Ð]l¬QÅ A†¤V> yîlDK àfOÆð‡ Ñgôæ-™èl-ÌSMýS$ ºçßæ$Ð]l$-™èl$Ë$ A…§ýl-gôæ-Ô>Æý‡$. A¯]l…-™èlÆý‡… G‹Ü-i-G‹œ M>Æý‡Å-§ýlÇØ ¯éVýSÆ>k Ð]l*sêÏ-yýl$-™èl*.. {糆¿ýæ MýS¯]l-º-Ça¯]l ѧéÅ-Æý‡$¦-ÌSMýS$ ¯ðlÌS 10¯]l çÜ…V>Æð‡-yìlzÌZ fÆý‡-VýS-¯]l$¯]l² EÐ]l$Ãyìl Ððl$§ýlMŠS hÌêÏ ´ùsîæÌZÏ ´ëÌŸY…-sêÆý‡° ™ðlÍ-´ëÆý‡$. M>Æý‡Å{MýS-Ð]l$…ÌZ Æ>çÙ‰ ï³Dsîæ çÜ…çœ$… M>Æý‡Å-°-Æ>Ó-çßæMýS A«§ýlÅ„ýS$yýl$ }°-Ðé-çÜ-Æ>Ð]l#, ï³yîlË$ ™èl¨-™èl-Æý‡$Ë$ ´ëÌŸY-¯é²Æý‡$.
పంట నష్టం అంచనా
కొల్చారం(నర్సాపూర్): గత నెల రోజులకుపైగా సింగూరు నుంచి ఘణపురం ఆనకట్టకు ఎడతెరిపి లేకుండా వస్తున్న వరద నీటితో మండలంలోని మంజీరా పరివాహక గ్రామాల్లోని పంట పొలాలు నీట మునిగాయి. బుధవారం చిన్నఘనాపూర్ పరిధిలో నీట మునిగిన పంటలను ఏఈఓ రాజశేఖర్‌రెడ్డి రైతులతో కలిసి సందర్శించారు. దాదాపు 62 ఎకరాల్లో వరి పంటకు నష్టం వాటిల్లిందని తెలిపారు. వరద కారణంగా పంట నష్టపోయిన రైతుల వివరాలను పొందుపరుస్తూ పూర్తి నివేదికను ఉన్నతాధికారులకు అందజేయనున్నట్లు తెలిపారు.
బాల్య వివాహాలు
చట్టరీత్యా నేరం
చిలప్‌చెడ్(నర్సాపూర్): బాల్య వివాహాలు చేస్తే కఠిన చర్యలు తప్పవని డీడబ్ల్యూఓ హేమభార్గవి తెలిపారు. బుధవారం ఆమె మాట్లాడుతూ.. చిలప్‌చెడ్‌లో మైనర్ బాలికను 34 ఏళ్ల వ్యక్తి వివాహం చేసుకోవడంతో పెళ్లి కొడుకుతో పాటు సహకరించిన వ్యక్తిపై పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు అయిందన్నారు. బాల్య వివాహాలకు పాల్పడిన, సహకరించిన చట్టరీత్యా నేరమని అన్నారు. బాల్య వివాహాలు జరుగుతున్నట్లు తెలిస్తే 1098, 100 ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని సూచించారు.
ఓటరు జాబితా కోసం ప్రత్యేక వెబ్‌సైట్
మెదక్ కలెక్టరేట్: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఓటరు జాబితాలో పేరును సులువుగా తెలుసుకోవడానికి రాష్ట్ర ఎన్నికల సంఘం అవకాశం కల్పిస్తోంది. ఇందుకోసం ఎన్నికల కమిషన్ ప్రత్యేకంగా వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఓటర్లు తమ వివరాలను ఈ సైట్ ద్వారా ఎక్కడి నుంచైనా తెలుసుకోవచ్చు. టీఎస్‌ఈసీ వెబ్‌సైట్‌కు వెళ్లి మొత్తం జాబితా పరిశీలించవచ్చు. లేదా ఎపిక్ నంబర్ ఆధారంగా ఓటరు వివరాలు తెలుసుకునే అవకాశం ఉంది. సదరు ఓటరు ఏ వార్డు పరిధికి చెందితే ఆ వార్డు పేజీని ఓపెన్ చేసి చూసుకోవచ్చు. వార్డు పరిధిలో మొత్తం ఎంతమంది ఓటర్లు ఉంటే వారి వివరాలు తెలుసుకోవచ్చు.
రోడ్డును బాగు చేయించండి
మనోహరాబాద్(తూప్రాన్): మనోహరాబాద్ మండలంలోని ముప్పిరెడ్డిపల్లి, కాళ్లకల్ పరిశ్రమల వాడ రోడ్డును బాగు చేయించాలని డీసీసీ అధ్యక్షుడు ఆంజనేయులుగౌడ్, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావును స్థానికులు కో రారు. బుధవారం మండల కేంద్రానికి వచ్చి న సందర్భంగా వారికి వినతిపత్రాన్ని అందజేశారు. సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్తామని వారికి హామీ ఇచ్చారు. కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు మహిపాల్‌రెడ్డి, నాయకులు నర్సింహా, నాగరాజు, నరేష్, రంగాచారి, రాంచందర్, వెంకటేష్, పెంటన్న, మహేష్, రామస్వామి తదితరులు పాల్గొన్నారు.