పరిషత్‌ సంగ్రామం | - | Sakshi
Sakshi News home page

పరిషత్‌ సంగ్రామం

Oct 9 2025 8:04 AM | Updated on Oct 9 2025 8:04 AM

పరిషత్‌ సంగ్రామం

పరిషత్‌ సంగ్రామం

నేడే తొలి విడత ఎన్నికల నోటిఫికేషన్‌ 11 వరకు నామినేషన్ల స్వీకరణ ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు హైకోర్టు తీర్పుపై ఆశావహుల్లో టెన్షన్‌

మెదక్‌జోన్‌/మెదక్‌కలెక్టరేట్‌: స్థానిక సంస్థల ఎన్నికల్లో కీలక ఘట్టానికి గురువారం తెరలేవనుంది. జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు ఉదయం 10.30 గంటలకు ఎన్నికల తొలి విడత నోటిఫికేషన్‌ జారీ కానుంది. ఆయా మండలాల్లో రిటర్నింగ్‌ అధికారులు (ఆర్‌ఓలు) ఈ నోటిఫికేషన్‌ను జారీ చేస్తారు. వెంటనే అభ్యర్థుల నుంచి నామినేషన్లను స్వీకరిస్తారు. 11వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లు వేసేందుకు గడువు ఉంటుంది. ఈ మేరకు 21 జెడ్పీటీసీ స్థానాలకు ఆయా మండల పరిషత్‌ కార్యాలయాల్లో నామినేషన్లు స్వీకరణ ప్రక్రియ కొనసాగిస్తారు. అసిస్టెంట్‌ డైరెక్టర్‌ కేడర్‌ అధికారులను ఆర్‌ఓలుగా నియమించారు. ఇక ఎంపీటీసీ స్థానాలకు సంబంధించి ప్రతీ రెండు, మూడు ఎంపీటీసీ స్థానాలకు ఒక ఆర్‌ఓను నియమించారు. క్లస్టర్‌ స్థాయిల్లో నామినేషన్ల స్వీకరణ ఉంటుంది. గెజిటెడ్‌ అధికారులు, హెచ్‌ఎంలు, సూపరింటెండెంట్‌ కేడర్‌ అధికారులకు ఎంపీటీసీ స్థానాల ఆర్‌ఓలుగా వ్యవహరిస్తున్నారు. స్కూల్‌ అసిస్టెంట్‌, సూపరింటెండెంట్‌ కేడర్‌ అధికారులను ఏఆర్‌ఓలుగా నియమించారు. రిజర్వేషన్ల అంశంపై హైకోర్టులో విచారణ జరుగుతున్న విషయం విదితమే. ఈ వాదనలు గురువారం కూడా కొనసాగనున్నాయి. బుధవారం హైకోర్టు ఎలాంటి స్టే విధించకపోవడంతో జిల్లా అధికార యంత్రాంగం యథావిధిగా ఎన్నికల ప్రక్రియను ప్రారంభించనుంది.

మెదక్‌ డివిజన్‌లో.. మొదటి విడత

జిల్లాలో 21 మండలాలు ఉండగా, 21 ఎంపీపీ, 21 జెడ్పీటీసీ 190 ఎంపీటీసీలు స్థానాలు ఉన్నాయి. మొదటి విడతలో మెదక్‌ డివిజన్‌ పరిధిలోని రేగోడ్‌, అల్లాదుర్గం, టేక్మాల్‌, పాపన్నపేట, మెదక్‌, హవేళిఘణాపూర్‌, నిజాంపేట, రామాయంపేట, చిన్నశంకరంపేట, పెద్దశంకరంపేట మండలాలకు సంబంధించి ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను నిర్వహించనున్నారు. 10 జెడ్పీటీసీ, స్థానాలకు ఎన్నికలు కొనసాగనుండగా, మెదక్‌ డివిజన్‌ పరిధిలోకి వచ్చే 91 ఎంపీటీసీ స్థానాలకు, రెండో విడతలో నర్సాపూర్‌, తూప్రాన్‌ డివిజన్‌లోని 11 మండలాల్లో ఎన్నికలను నిర్వహించనున్నారు.

ముహూర్తాలు

చూసుకుంటున్న అభ్యర్థులు

ఎంపీటీసీ, జెడ్పీటీసీగా పోటీ చేసే అభ్యర్థులు నామినేషన్లు వేసేందుకు ముహుర్తాలు చూసుకుంటున్నా రు. ఈ మూడు రోజుల్లో వారికి కలిసి వచ్చే రోజు చూసుకొని నామినేషన్లు వేసేందుకు సిద్ధమవుతున్నారు. అలాగే ఆయా పార్టీలు అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను సైతం వేగం పెంచింది.

íܧýl®…V> E…yýl…yìl: MýSÌñæMýStÆŠæḥ

మెదక్‌ కలెక్టరేట్‌: నేటి నుంచి జిల్లాలో జరిగే మొదటి విడత ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియకు సంబంధిత అధికారులు సిద్ధంగా ఉండాలని జిల్లా ఎన్నికల అధికారి రాహుల్‌రాజ్‌ తెలిపారు. బుధవారం రాత్రి ఆయన ఎన్నికల అధికారులు, సిబ్బందితో నామినేషన్ల ప్రక్రియపై గూగుల్‌ మీట్‌ నిర్వహించారు. మొదటి విడత జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నోటిఫికేషన్‌ జారీకి సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. ఇందుకు సంబంధించి ఆర్వో, ఏఆర్‌ఓలకు శిక్షణ ఇచ్చినట్లు వివరించారు. ఎన్నికల కమిషన్‌ ఆదేశాల మేరకు రిపోర్టులను ఎప్పటికప్పుడు పంపిస్తున్నామని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement