
మరో విడత వచ్చేశాయి
జిల్లాకు చేరుకున్న పాఠ్యపుస్తకాలు
ఇంకా రావాల్సినవి 12,750
వచ్చినవి 1,64,300
మెదక్ కలెక్టరేట్: నేటి నుంచి ప్రభుత్వ పాఠశాలలకు రెండో విడత పాఠ్య పుస్తకాలు సరఫరా చేయనున్నారు. జిల్లాలో మొదటి విడత పాఠ్య పుస్తకాలు (పార్ట్–1) జూన్‌లో విద్యార్థులకు అందజేశారు. తాజాగా రెండో విడతవి జిల్లా కేంద్రంలోని గోదాంకు చేరుకున్నాయి. వీటిని గురువారం నుంచి ఎమ్మార్పీలకు తరలించనున్నారు. అనంతరం పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు అందజేయనున్నా రు. జిల్లాకు 1,77,050 పాఠ్యపుస్తకాలు అవసరం కాగా, ప్రస్తుతం 1,64,300 వచ్చాయి. ఇంకా 12,750 పాఠ్యపుస్తకాలు రావాల్సి ఉంది. జిల్లాలో ప్రభుత్వ, జిల్లా, మండల పరిషత్ పాఠశాలలు 629 ఉండగా 25,911 మంది విద్యార్థులు, 128 ప్రాథమికోన్నత పాఠశాలలు ఉండగా 8,754 మంది, 146 ఉన్నత పాఠశాలలు ఉండగా 28,878 మంది, 19 కేజీబీవీలు ఉండగా 4,001 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. కాగా 3వ తరగతి గణితం, 4వ తరగతి ఈవీఎస్ పుస్తకాలు రావాల్సి ఉంది.