బిల్లులివ్వకుంటే భోజనమెట్లా..? | - | Sakshi
Sakshi News home page

బిల్లులివ్వకుంటే భోజనమెట్లా..?

Oct 8 2025 8:11 AM | Updated on Oct 8 2025 8:11 AM

బిల్లులివ్వకుంటే భోజనమెట్లా..?

బిల్లులివ్వకుంటే భోజనమెట్లా..?

మధ్యాహ్న భోజన పథకం నిర్వాహకులకు 4 నెలలుగా రాని బిల్లులు జిల్లావ్యాప్తంగా రూ.3.50 కోట్లుపెండింగ్‌ ఆందోళన వ్యక్తం చేస్తున్న వంట నిర్వాహకులు విద్యార్థులకు అమలుకాని మెనూ

ఈ చిత్రంలో కనిపిస్తున్న మహిళాపేరు షబీనాబేగం. పట్టణంలోని ఫతేనగర్‌ ప్రాథమికోన్నత పాఠశాలలో వంట కార్మికురాలిగా పనిచేస్తోంది. 180 మంది విద్యార్థులకు మధ్యాహ్న భోజనం వండి పెడుతుంది. నాలుగు నెలలుగా మధ్యాహ్న భోజనం బిల్లులు రాకపోతుండటంతో షబీనాబేగం తన బంగారు ఆభరణాలు రూ.80వేలకు కుదవబెట్టి పిల్లలకు వంట చేసి పెడుతోంది. బిల్లులతోపాటు ఆమెకు రావాల్సిన గౌరవ వేతనం కూడా ప్రభుత్వం పెండింగ్‌లో పెట్టడంతో అప్పు తెచ్చిన చోట వడ్డీ పెరిగిపోతోందని షబీనా బేగం ఆందోళన చెందుతోంది. ఇది ఒక్క షబీనా బేగంకే కాదు. జిల్లాలో వేలాది మంది వంట కార్మికులది దాదాపు ఇదే పరిస్థితి.

మెదక్‌జోన్‌: మెదక్‌ జిల్లా వ్యాప్తంగా 882 ప్రభుత్వం పాఠశాలల్లో మధ్యాహ్నభోజనం పథకం కొనసాగుతోంది. వీటిలో 63 వేల పైచిలుకు విద్యార్థులు చదువుకుంటున్నారు. మధ్యాహ్నభోజనం వండి పెట్టినందుకుగానూ 1 నుంచి 8వ తరగతి విద్యార్థులకు ఒక్కొక్కరికి రోజుకు రూ 6.29 చొప్పున అలాగే 9–10 విద్యార్థులకు రోజుకు రూ.8.40 చొప్పున దీనికి తోడు గుడ్డుకోసం ప్రత్యేకంగా రూ.6 ప్రభుత్వం ఇస్తోంది. వారంలో 3 సార్లు గుడ్డు విద్యార్థులకు పెట్టాల్సి ఉండగా పప్పు, కూరగాయలు, సాంబారుతో మాత్రమే భోజనం వడ్డిస్తున్నారు.

రూ 3.50 కోట్ల బకాయిలు!

విద్యార్థులకు అందించే మధ్యాహ్నభోజన బిల్లులతో పాటు వంట నిర్వాహకులకు ఇచ్చే గౌరవవేతనంలోనూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వస్తోంది. 1–8 వ తరగతి విద్యార్థులకు అందించే భోజన బిల్లుల్లో 60% కేంద్ర ప్రభుత్వం 40% రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నాయి. వంట నిర్వాహకులకు ఒక్కో మహిళకు నెలకు రూ.3000 చొప్పున చెల్లిస్తుండగా అందులో రాష్ట్రప్రభుత్వం రూ.2,400 ఇస్తుండగా కేంద్రం రూ.600 చొప్పున చెల్లిస్తోంది. 1–8 విద్యార్థులకు సంబంధించిన భోజన బిల్లులు ఆగస్టు నుంచి 2 నెలలు పెండింగ్‌లో ఉండగా 9–10 వ, తరగతి విద్యార్థులకు సంబంధించి భోజన బిల్లులను మాత్రం పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తోంది. అయితే జూన్‌ నుంచి 4 నెలల బిల్లులను ప్రభుత్వం పెండింగ్‌లో ఉంచింది. అలాగే వంట కార్మికులకు ఇచ్చే గౌరవవేతనం సైతం నాలుగు మాసాలుగా పెండింగ్‌లో ఉన్నాయి.

అమలుకాని మెనూ..!

నాలుగు మాసాలుగా మధ్యాహ్నభోజన బిల్లులతో పాటు వంట కార్మికులకు ఇవ్వాల్సిన జీతం ఇవ్వక పోవటంతో అనేక బడుల్లో మెనూ అమలు కావటంలేదు. వంటకార్మికులకు బిల్లులు రాకపోవటంతో ఉపాధ్యాయులు సైతం వంట నిర్వాహకులను చూసీచూడనట్లు వదిలేస్తున్నారని తెలుస్తోంది. కొన్ని నిర్వాహకులు చేతులు ఎత్తేస్తే ఉపాధ్యాయులే వడ్డీకి డబ్బులు ఇప్పించి విద్యార్థులకు మధ్యాహ్నభోజనం సాగే విధంగా చర్యలు తీసుకుంటున్నారు.

వారం రోజుల్లో బడ్జెట్‌ రావచ్చు

రోవారం రోజుల్లో మధ్యాహ్నభోజన బిల్లులతోపాటు వంట కార్మికులకు జీతం సైతం వచ్చే అవకాశం ఉంది. బడ్జెట్‌రాగానే కార్మికులకు అందజేస్తాం.

– రాధాకృష్ణ డీఈఓ మెదక్‌

కూచన్‌పల్లి ఉన్నత పాఠశాలలో వంట చేస్తున్న వంట కార్మికులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement