
న్యాయవాదుల నిరసన
హుస్నాబాద్: సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిపై దాడి చేయడం.. న్యాయ వ్యవస్థపై దాడి చేయడమేనని హుస్నాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా మంగళవారం న్యాయవాదుల ఆధ్యర్వంలో కోర్టు ఎదుట విధులను బహిష్కరించి నిరసన వ్యక్తం చేశారు. అలాగే నాలుగు రోజుల పాటు విధులను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు. మరోవైపు పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో ప్రజాసంఘాల ఆధ్వర్యంలో నాయకులు నిరసన తెలిపారు. కార్యక్రమంలో ఏజీపీ సదానందం, న్యాయవాదులు మల్లేశం, కన్నోజు రామకృష్ణ, ప్రవీణ్, హుస్నాబాద్ జేఏసీ కో–ఆర్టినేటర్ వీరన్నయాదవ్, నాయకులు గంపల శ్రీనివాస్ పాల్గొన్నారు.