
ప్రతిభావంతులకు ప్రోత్సాహం
మెదక్ మున్సిపాలిటీ: శిక్షణా కార్యక్రమాల్లో ప్రతిభ కనబరిచే సిబ్బందిని జిల్లా పోలీస్ శాఖ ఎల్లప్పుడూ ప్రోత్సహిస్తుందని జిల్లా ఎస్పీ డీవీ శ్రీనివాసరావు పేర్కొన్నారు. రాష్ట్రస్థాయిలో ఫైరింగ్, పీపీటీలో ఉత్తమ ప్రతిభ కనబర్చి పతకాలు సాధించిన కానిస్టేబుల్ నరేశ్‌ను మంగళవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...ఇలాంటి యువ సిబ్బంది కృషి భవిష్యత్తులో మరింత ఉన్నతస్థాయికి తీసుకువెళ్తుందన్నారు. ఈ సందర్బంగా నరేశ్‌కు రివార్డు మంజూరు చేశారు. అనంతరం ఉద్యోగ విరమణ పొందుతున్న హెడ్ కానిస్టేబుల్ రవీందర్, సీనియర్ అసిస్టెంట్ అల్తాఫ్ హుస్సేన్‌లను ఎస్పీ ఘనంగా సన్మానించారు. భవిష్యత్తులో మీకు ఏవైనా సమస్యలు ఎదురైనా, పోలీస్ శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో ఏఆర్ డీఎస్పీ రంగా నాయక్, శైలేందర్, ఎసైలు నరేశ్ భవానీ కుమార్, మణి పాల్గొన్నారు.
కానిస్టేబుల్ నరేశ్‌ను అభినందించిన ఎస్పీ