
మార్కెట్లకు దసరా జోష్
జిల్లా కేంద్రంలోని మార్కెట్లలో బుధవారం దసరా సందడి నెలకొంది. బతుకమ్మ, దసరా పండుగలను పురస్కరించుకొని నూతన దుస్తులు, ఇతర సామగ్రి కొనుగోళ్లకు ప్రజలు తరలివస్తున్నారు. వారం రోజులుగా పట్టణంలోని రాందాస్ చౌరస్తా, జేఎన్ రోడ్డు వరకు ప్రధాన రహదారులన్నీ కిటకిటలాడుతున్నాయి. కూరగాయల మార్కెట్, పెద్ద బజార్ ప్రాంతాల్లో ట్రాఫిక్ నియంత్రణ లేకపోవడంతో ఇష్టారీతిగా వాహనాలు వస్తున్నాయి. దీంతో ఎక్కడికక్కడ ట్రాఫిక్ సమస్య ఏర్పడుతోంది.
– మెదక్‌మున్సిపాలిటీ