
మున్సిపల్ వర్కర్లకు వైద్య పరీక్షలు
మెదక్ మున్సిపాలిటీ: స్వచ్ఛత హీ సేవ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం స్థానిక మున్సిపల్ కార్యాలయంలో వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ పరిధిలో పనిచేసే పారిశుద్ధ్య కార్మికులు, సిబ్బందికి వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం అవసరమైన వారికి మందులు అందజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మహేష్, టౌన్ ప్లానింగ్ అధికారి భూపతి, టౌన్ ప్లానింగ్ సూపర్‌వైజర్ ప్రభాకర్, ఎన్విరాన్‌మెంట్ ఇంజనీర్ వెంకటేష్, ప్రభుత్వ వైద్యులు వంశీ చారి, ప్రభుత్వ ఆస్పత్రి వైద్య సిబ్బంది పాల్గొన్నారు.