
‘స్థానిక’ విధుల్లో అవకాశం కల్పించాలి
మెదక్ కలెక్టరేట్: స్థానిక సంస్థల ఎన్నికల విధుల్లో సీనియర్ టీచర్లకు అవకాశం ఇవ్వాలని పీఆర్టీయూ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు తాళ్ల శ్రీనివాస్, సామ్యనాయక్‌లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు పీఆర్టీయూ ఆధ్వర్యంలో శుక్రవారం అదనపు కలెక్టర్ నగేష్‌ను కలిసి వినతి పత్రం అందజేశారు. అనంతరం పీఆర్టీయూ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు మాట్లాడుతూ ఎన్నికల శిక్షణకు హాజరుకాని టీచర్లకు దసరా సెలవుల అనంతరం మరోసారి శిక్షణ ఇవ్వాలన్నారు. అలాగే స్థానిక సంస్థల ఎన్నికల విధుల్లో సీనియర్ టీచర్లకు అవకాశం కల్పించాలన్నారు. దివ్యాంగులకు, మెడికల్ గ్రౌండ్‌లో ఉన్న టీచర్లకు ఎలక్షన్ విధుల నుంచి మినహాయించాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ అధ్యక్షులు సుంకరి కృష్ణ, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు వెంకటరామ్ రెడ్డి, మల్లారెడ్డి, మహేష్, సతీష్ రావు, పంతులు రాజు, అమీరుద్దీన్, సహదేవ్, జనార్దన్ తదితరులు పాల్గొన్నారు.