కుండపోత వర్షం | - | Sakshi
Sakshi News home page

కుండపోత వర్షం

Sep 27 2025 8:26 AM | Updated on Sep 27 2025 8:26 AM

కుండప

కుండపోత వర్షం

చెరువులకు జలకళ

కౌడిపల్లి(నర్సాపూర్‌): మండలంలో 65.6మిల్లీ మీటర్ల కుండపోత వర్షం నమోదైంది. దీం కౌడిపల్లి, రాయిలాపూర్‌, మహమ్మద్‌నగర్‌, రాజిపేట, సదాశివపల్లి తదితర గ్రామాలలోని పెద్ద చెరువులు, కుంటలు అలుగు పారుతున్నాయి.

నిలిచిన రాకపోకలు

టేక్మాల్‌(మెదక్‌): మండలంలో గురువారం రాత్రి కురిసిన భారీ వర్షానికి గుండువాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. దీంతో టేక్మాల్‌–జోగిపేట, ఎలకుర్తి–కోరంపల్లి ప్రధాన రహదారుల్లో రాకపోకలు నిలిచిపోయాయి.

భారీ వర్షం

పెద్దశంకరంపేట(మెదక్‌): మండలంలో కురిసిన భారీ వర్షానికి చెరువులు, కుంటలలో నీరు సమృద్ధిగా చేరి అలుగులు ప్రవహిస్తున్నాయి. అయితే ఈ వర్షాలకు పంటలు దెబ్బతింటున్నాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

అంతరాయం..

హవేళిఘణాపూర్‌(మెదక్‌): మండల పరిధిలోని ఆయా గ్రామాల్లో కురిసిన వర్షాలతో చెరువు, కుంటలు పొంగిపొర్లుతున్నాయి. గంగమ్మవాగు ఉధృతి పెరగడంతో దూప్‌సింగ్‌ తండాకు రాకపోకలు నిలిచిపోయాయి. అలాగే మెదక్‌ మండలంలోని కోంటూర్‌ చెరువు పొంగిపొర్లుతుండడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

నర్సాపూర్‌: మండలంలో 74 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. ఈ వర్షాలకు రాయరావు చెరువు మళ్లీ అలుగు పారింది. దీంతో పాటు ఆయా గ్రామాల చెరువులు సైతం అలుగులు పారుతున్నాయి.

అలుగు పారుతున్న చెరువులు, కుంటలు

పలు ప్రాంతాల్లో రాకపోకలకు అంతరాయం

కుండపోత వర్షం 
1
1/1

కుండపోత వర్షం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement