
నియోజకవర్గ అభివృద్ధికి కృషి
చిన్నశంకరంపేట(మెదక్): దుర్గామాత ఆశీస్సులతో స్థానిక నియోజవర్గ అభివృద్ధికి కృషిచేస్తానని కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు అన్నారు. శుక్రవారం మండలంలోని కొర్విపల్లిలో వెలసిన దుర్గామాత ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయన వెంట డీసీసీ అధ్యక్షుడు ఆంజనేయులుగౌడ్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు సత్యనారాయణ, రాజిరెడ్డి, యాదవరావు, శ్రీనివాస్‌రెడ్డి ఉన్నారు.
మెరుగైన సేవలు అందించాలి
పాపన్నపేట(మెదక్): పెట్రోల్ బంకు యజమానులు వినియోగదారులకు మెరుగైన సేవలు అందించాలని జహీరాబాద్ ఎంపీ సురేష్ షెట్కార్, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంత్‌రావు అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని పాపన్నపేటలో హెచ్‌పీ పెట్రోల్ బంక్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బంకు యజమానులు రాజశేఖర్, మహేందర్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు గోవింద్ నాయక్, కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షులు ప్రభాకర్ రెడ్డి, శ్రీకాంతప్ప, ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు.
మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు