
గొప్ప మనసు చాటుకున్న మాజీ ఎమ్మెల్యే
కౌడిపల్లి(నర్సాపూర్): పట్టణంలోని డిగ్రీ కళాశాలకు రెండేళ్లపాటు కిరాయి లేకుండా సొంతభవనం ఇస్తున్నట్లు మాజీ ఎమ్మెల్యే మదన్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం మంజూరు చేసిన డిగ్రీ కళాశాల నర్సాపూర్‌లో కొనసాగుతుందన్నారు. అయితే కౌడిపల్లిలోని తన సొంతభవనం రెండేళ్లపాటు కిరాయి లేకుండా డిగ్రీ కళాశాలకు ఇస్తున్నట్లు ప్రకటించారు. దీంతో ఈ ప్రాంత విద్యార్థులు నర్సాపూర్ వెళ్లాల్సిన అవసరం లేదన్నారు. రెండు నెలల క్రితం ఉన్నత విద్యాశాఖకు లేఖ రాయగా ప్రస్తుతం అనుమతి మంజూరైనట్లు చెప్పారు. ప్రస్తుతం నర్సాపూర్‌లో కొనసాగుతున్న డిగ్రీ కళాశాల దసరా ముగిసిన అనంతరం ఇక్కడే ప్రారంభించనున్నట్లు వివరించారు. త్వరలోనే సీఎం రేవంత్‌రెడ్డి సహకారంతో సొంతభవనం నిర్మించేందుకు కృషి చేస్తామన్నారు. దీంతోపాటు నూతనంగా నిర్మిస్తున్న సీహెచ్‌సీని త్వరలోనే ప్రారంభించనున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ వెంకటేశ్వర్‌రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్లు గోవర్ధన్‌రెడ్డి, రాజుయాదవ్, వైస్‌చైర్మన్ చిన్నంరెడ్డి, నాయకులు కృష్ణాగౌడ్, దుర్గాగౌడ్, శాఖయ్య, శెట్టయ్య, మోతిలాల్‌గౌడ్, పుండరీకంగౌడ్ తదితరులు పాల్గొన్నారు.
రెండేళ్లపాటు కిరాయి లేకుండా కళాశాలకు సొంతభవనం
మాజీ ఎమ్మెల్యే మదన్‌రెడ్డి