
విద్యతో పాటూ సేవాభావం ఉండాలి
కొల్చారం(నర్సాపూర్): ప్రతి విద్యార్థి సామాజిక సేవాగుణం, నాయకత్వ లక్షణాలు కలిగి ఉండాలని అదనపు ఎస్పీ మహేందర్ సూచించారు. మండలంలోని పోతంశెట్టిపల్లిలో గత ఆరు రోజులుగా మెదక్ డిగ్రీ కళాశాల ఎన్‌ఎస్‌ఎస్ వలంటీర్లు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. యోగాతో పాటు గ్రామంలోని ప్రధాని కూడళ్ల వద్ద ఉన్న మురికి కాలువలను శుభ్రం చేస్తున్నారు. గ్రామంలో ఉద్యోగ, విద్య సర్వే నిర్వహించారు. బుధవారం ఉన్నత పాఠశాలలో ముగింపు సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా అదనపు ఎస్పీ మాట్లాడుతూ.. సమష్టిగా ముందుకు సాగుతూ సేవా కార్యక్రమాల నిర్వహించడం హర్షించదగిన విషయమన్నారు. ఎన్‌ఎస్‌ఎస్ కార్యక్రమాలను మరింత విస్తృత పరచాలని సూచించారు. కార్యక్రమంలో హెచ్‌ఎం ఉమారాణి, అధ్యాపకుడు ప్రవీణ్ కు మార్, ప్రోగ్రాం అధికారి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
అదనపు ఎస్పీ మహేందర్