
బగలాముఖీ శక్తిపీఠంలో విశేష పూజలు
శివ్వంపేట(నర్సాపూర్): బగలాముఖీ శక్తిపీఠంలో అమావాస్య సందర్భంగా ఆదివారం విశేష పూజలు నిర్వహించారు. వేద పండితుడు శాస్త్రుల వెంకటేశ్వరశర్మ ఆధ్వర్యంలో మహామంత్ర హవనం, హరిద్వార్చన పూజలు చేపట్టారు. మాజీ ఎంపీ సంతోష్‌రావు, మాజీ ఎమ్మెల్సీ శేరి సుభాశ్‌రెడ్డి అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. శివ్వంపేటకు చెందిన రమేష్‌గుప్తా భక్తులకు అన్నదానం నిర్వహించారు. ఆలయ అభివృద్ధికి రూ. 54 వేలను ఆలయ నిర్వాహకులకు అందజేశారు.
మెదక్ కలెక్టరేట్: బతుకమ్మ సంబురాలను జిల్లాలోని మహిళలు సంతోషంగా జరుపుకోవాలని, నిమజ్జన వేళ జాగ్రత్తలు పాటించాలని కలెక్టర్ రాహుల్‌రాజ్ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పూలను పూజించి ప్రకృతిని ఆరాధించే బతుకమ్మ పండుగ తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయానికి ప్రతీక అన్నారు. ప్రజలందరూ కుటుంబ సమేతంగా ఆనందంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. ప్రతి ఒక్కరూ ఐకమత్యంతో, సోదరభావంతో పండుగను దిగ్విజయంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు.
ఝరాసంగం(జహీరాబాద్): దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన శ్రీ కేతకీ సంగమేశ్వరాలయంలో భక్తులు అమావాస్య పూజలు నిర్వహించారు. ఆదివారానికి తోడు అమావాస్య కలిసి రావడంతో తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక మహారాష్ట్రలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తు లు అధిక సంఖ్యలో తరలివచ్చారు. గర్భగుడిలోని పార్వతీ పరమేశ్వరులకు ప్రాతఃకాలం ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు దర్శన సౌకర్యం కల్పించారు. వేకువ జాము నుంచే ఆలయానికి భక్తుల తాకిడి పెరిగింది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు ఆల య ఆవరణలోని అమృతగుండంలో పవిత్ర పుణ్యస్నానాలు ఆచరించి గుండంలోని జల లింగానికి పూజలు చేశారు. అనంతరం గర్భగుడిలోని స్వామివారిని క్యూలైన్ల ద్వారా దర్శించుకున్నా రు. అనంతరం ఆలయ అర్చకులు స్వామివారి తీర్థప్రసాదాలు అందించి, ఆశీర్వదించారు.
నారాయణఖేడ్: విజయవంతంగా వైద్యవిద్య ను పూర్తి చేసి పేదలకు సేవలందించాలని ఇటీవల ఎంబీబీఎస్‌లో సీటు సాధించిన రాథోడ్ దినేశ్ నాయక్‌కు మాజీమంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు సూచించారు. ఖేడ్ మండలం పలుగు తండాకు చెందిన రాథోడ్ దినేశ్ నాయక్ సిద్దిపేట మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ సీటును సాధించాడు. తండ్రి రాథోడ్ పండిత్‌నాయక్ ఆటో నడుపుతుండగా తల్లి ధూ రిబాయి వ్యవసాయ కూలిపనులు చేస్తుంది. ఆదివారం దినేశ్ నాయక్ ఖేడ్ తాజా మాజీ జెడ్పీటీసీ రవీందర్ నాయక్, ర్యాకల్, పలుగు తండాలకు చెందిన నాయకులు గోపాల్‌రెడ్డి, శ్రీధర్‌రెడ్డి, నెహ్రునాయక్, నితిన్ నాయక్‌లతో కలిసి హైదరాబాద్‌లోని మాజీమంత్రి హరీశ్‌రావు నివాసానికి వెళ్లారు. ఈ సందర్భంగా దినేష్ నాయక్‌ను హరీశ్‌రావు ఘనంగా సన్మానించారు. రవీందర్ నాయక్ భవానీమాత దీక్ష చేపట్టి కాశీ, అయోధ్య, పౌరాదేవీ యాత్రలు ముగించుకుని వచ్చిన నేపథ్యంలో మహాప్రసాదాన్ని హరీశ్‌రావుకు అందజేశారు.
ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): కురుమలు కేవలం ఉద్యోగాల్లోనే కాకుండా వ్యాపారం, రాజకీయాలలో రాణించాలని కురుమ ఉద్యోగులు సంఘం జిల్లా అధ్యక్షుడు పోతుగంటి రవికాంత్ అన్నారు. సంఘం కార్యవర్గ సమావేశం ఆది వారం జిల్లా కేంద్రంలో నిర్వహించారు. నూతన కార్యవర్గాన్ని వ్యవస్థాపక అధ్యక్షుడు రాములు ఆధ్వర్యంలో ఎన్నుకున్నారు.

బగలాముఖీ శక్తిపీఠంలో విశేష పూజలు

బగలాముఖీ శక్తిపీఠంలో విశేష పూజలు