
ఉపాధ్యాయుడికి పురస్కారం
నర్సాపూర్ రూరల్: మండలంలోని కాగజ్‌మద్దూర్ పాఠశాలలో విధులు నిర్వర్తిస్తున్న ఉపాధ్యాయుడు, సాహితీవేత్త డాక్టర్ రాయరావు సూర్యప్రకాశ్‌రావు ఇటీవల హైదరాబాద్‌లో ఎర్రంరెడ్డి రంగనాయకమ్మ ధర్మనిధి పురస్కారం అందుకున్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కవి, రచయిత గా, పరిశోధకుడిగా, విమర్శకుడిగా, అనువాదకుడిగా సాహిత్య సంస్థల నిర్వాహకుడిగా, మన్‌కీబాత్ ప్రసంగాలను ఆకాశవాణి కోసం తెలుగులో అనువదించడం వంటి సేవలు అందిస్తున్నందుకు గాను గుర్తించి ఎంపిక చేశారని తెలిపారు. పురస్కారంతో మరింత ఉత్సాహంగా తన వంతు సేవలను అందిస్తానని పేర్కొన్నారు.