
పండుగల వేళ అప్రమత్తత అవసరం
ఎస్పీ శ్రీనివాసరావు
మెదక్ మున్సిపాలిటీ: దసరా, బతుకమ్మ పండుగల వేళ ప్రజలు అప్ర మత్తంగా ఉండాలని ఎస్పీ డీవీ శ్రీనివాసరావు సూచించారు. శనివారం ఆయన మాట్లాడుతూ.. సెలవులు రావడంతో అనేక మంది ఊర్లకు ప్రయాణిస్తున్నారని, బంగారు నగలు, విలువైన వస్తువులను బ్యాంకు లాకర్‌లో భద్రపరుచుకోవాలని సూచించారు. ఊర్లకు బయలుదేరే ముందు పక్కింటి వారు, నమ్మదగిన వ్యక్తులకు సమాచారం ఇవ్వాలన్నారు. సుదూర ప్రాంతాలకు వెళ్లే వారు తమ ఫోన్ నంబర్లు, వివరాలు సమీప పోలీస్‌స్టేషన్‌్‌లో నమోదు చేసుకోవాలని తెలిపారు.
పరేడ్‌తో ఫిట్‌నెస్, క్రమశిక్షణ
అదనపు ఎస్పీ మహేందర్
మెదక్ మున్సిపాలిటీ: పరేడ్‌తో సిబ్బందిలో ఫిట్‌నెస్, క్రమశిక్షణ పెరుగుతుందని అదనపు ఎస్పీ మహేందర్ అన్నారు. శనివారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో పరేడ్ నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పోలీస్ సిబ్బంది ప్రజలతో మర్యాద, వినయంతో వ్యవహరించాలన్నారు. నేర నివారణ, శాంతిభద్రతల పరిరక్షణలో కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజా సమస్యల పరిష్కారంలో అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. పరేడ్ అనంతరం సిబ్బందితో సమావేశమై వారి సంక్షేమానికి సంబంధించిన అంశాల గురించి చర్చించారు.
తాగునీటి కోసం తండ్లాట
కౌడిపల్లి(నర్సాపూర్): మండలంలోని రాయిలాపూర్‌లో తాగునీటి సమస్య నెలకొంది. దీంతో గ్రామస్తులు శనివారం పంట పొలాల్లోని బోరు బావుల వద్ద నుంచి నీటిని తెచ్చుకుంటున్నారు. సమస్యను ఎవరూ పరిష్కరించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయమై పంచాయతీ కార్యదర్శి సలీం మాట్లాడుతూ.. నాలుగు బోర్లతో గ్రామానికి తాగునీరు సరఫరా చేస్తున్నామని, కొన్ని నల్లాలకు చెర్రాలు తొలగించడంతో సమస్య ఉత్పన్నమై నీరు రావడం లేదన్నారు. ట్యాంకర్ ద్వారా నీటిని సరఫరా చేస్తున్నామని చెప్పారు.
జీఎస్టీ తగ్గింపుతో మేలు
నర్సాపూర్: ప్రధాని నరేంద్రమోదీ జీఎస్టీని తగ్గిస్తూ తీసుకున్న నిర్ణయంతో పేద, మధ్య తరగతి ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు మల్లేశ్‌గౌడ్ అన్నారు. శనివారం ఆయన మాట్లాడుతూ.. మోదీ 11 ఏళ్ల పరిపాలనలో పేద ప్రజలతో పాటు రైతులకు మేలు చేసే అనేక సంస్కరణలు తెచ్చారని కొనియాడారు. తాజాగా జీఎస్టీ తగ్గించి మరో సంస్కరణ అందుబాటులోకి తెచ్చారన్నారు. దసరా, దీపావళి పండుగల వేళ పన్ను తగ్గించడంతో ప్రజలు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. ఇళ్ల నిర్మాణాలకు కేంద్రం నిధులు ఇస్తున్నా, రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రాకపోవడం విచారకరమని అన్నారు. సమావేశంలో ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు చిన్న రమేష్‌గౌడ్, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

పండుగల వేళ అప్రమత్తత అవసరం

పండుగల వేళ అప్రమత్తత అవసరం

పండుగల వేళ అప్రమత్తత అవసరం