
పథకాలకు యువకులే ప్రచారకర్తలు
యువజన సర్వీసుల శాఖ ఉమ్మడి జిల్లా కో ఆర్డినేటర్ రంజిత్‌రెడ్డి
రామాయంపేట(మెదక్): యువత కేంద్ర పథకాలను సద్వినియోగం చేసుకోవాలని యువజన సర్వీసుల శాఖ ఉమ్మడి జిల్లా కో ఆర్డినేటర్ రంజిత్‌రెడ్డి సూచించారు. శనివారం ఎంపీడీఓ కార్యాలయంలో నిర్వహించిన యువ సమ్మేళనంలో పాల్గొని మాట్లాడారు. సరైన ప్రచారం లేకపోవడంతో కేంద్ర ప్రభు త్వ పథకాలు చాలా వరకు ప్రజలకు తెలియడం లేదన్నారు. దీంతో ప్రజలు నష్టపోతున్నారని వాపోయారు. రిసోర్స్ పర్సన్, పోస్టల్ అధికారి నగేశ్ మాట్లాడుతూ.. ప్రపంచంలో అత్యధికంగా యువత ఉన్న దేశం భారతదేశం మాత్రమేనన్నారు. పోస్టల్ పథకాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో యువజన సర్వీసులశాఖ అధికారి కిరణ్, సహాయ అధికారి రాజు, డిగ్రీ కళాశాల అధ్యాపకుడు రవీందర్, వివిద కళాశాలల విద్యా ర్థులు పాల్గొన్నారు.