
నిమజ్జనానికి పటిష్ట బందోబస్తు
ఎస్పీ డీవీ శ్రీనివాసరావు
మెదక్ మున్సిపాలిటీ: గణపతి నిమజ్జనానికి పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు ఎస్పీ డీవీ శ్రీనివాసరావు తెలిపారు. ఈ మేరకు సోమవారం జిల్లాలోని పోలీస్ అధికారులకు టెలీ కాన్ఫరెన్స్ ద్వారా స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేశారు. ఎలాంటీ అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా చర్యలు తీసుకోవాలన్నారు. సీసీ కెమెరాలు ఏర్పాటుతో పాటు పోలీస్ కంట్రోల్ రూమ్‌లో ప్రత్యేక మానిటరింగ్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అంతకుముందు ప్రజావాణి కా ర్యక్రమంలో భాగంగా వినతులు స్వీకరించారు. అనంతరం జిల్లాలోని ప్రజలు పోగొ ట్టుకున్న 167 సెల్‌ఫోన్లను సిబ్బంది రికవరీ చేసి ఎస్పీ వారికి అందజేశారు. కార్యక్రమంలో పోలీస్ అధికారులు పాల్గొన్నారు.