
సీపీఎస్‌ను రద్దు చేయాల్సిందే
మెదక్ కలెక్టరేట్: ఉద్యోగులకు శాపంగా మారిన సీపీఎస్‌ను రద్దు చేసి, మెదక్‌ను చార్మినార్ జోన్‌లో చేర్చాలని ఉద్యోగ, ఉపాధ్యాయ జేఏసీ జిల్లా అధ్యక్షుడు నరేందర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా సోమవారం మధ్యాహ్న భోజన విరామ సమయంలో ఉద్యోగ, ఉపాధ్యాయులతో కలిసి కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే సీపీఎస్‌ను రద్దు చేసి పాత పెన్షన్ అమలు చేయాలన్నారు. కొత్త పెన్షన్ అమలు సమయంలో కేంద్రం ఉద్యోగులకు ఎన్నో ఆశలు చూపిందని వాపోయారు. రిటైర్మెంట్ తర్వాత ఉద్యోగి జీవితానికి ఆసరాగా ఉండే పెన్షన్ తొలగించి వారి జీవితాల్లో ఆనందం లేకుండా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.