
హెల్ప్‌డెస్క్‌కు 65 వినతులు
మెదక్ కలెక్టరేట్: కలెక్టరేట్‌లో సోమవారం హెల్ప్‌డెస్క్ ద్వారా ప్రజావాణి నిర్వహించగా, ఇన్‌వార్డు అధికారులు ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. జిల్లా నలుమూలల నుంచి తమ తమ సమస్యలపై 65 అర్జీలు అందజేశారు. ఈసందర్భంగా పలువురు సమస్యలపై నిరసన గళం విప్పారు. ఇటీవల జిల్లాలో కురిసిన వర్షాలతో నష్టపోయిన వారిని అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి సర్వే చేయాలని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు అడివయ్య పభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం కలెక్టరేట్ ఎదుట రైతులతో కలిసి నిరసన తెలిపారు. పాపన్నపేట మండలం నాగ్సాన్‌పల్లికి చెందిన వడ్డెరలు తమకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని నిరసన తెలిపారు. అనంతరం అదనపు కలెక్టర్ నగేశ్‌కు వినతిపత్రం అందజేశారు. తమకు ఆరు నెలలుగా వేతనాలు రావడం లేదని మోడల్ స్కూళ్లలో పని చేసే ఔట్ సోర్సింగ్ సిబ్బంది ఆందోళన వ్యక్తం చేశారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇతర దేశాలపై అడ్డగోలుగా విధిస్తున్న పన్నులను వెంటనే రద్దు చేయాలని నిరసిస్తూ సీఐటీయూ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు.