
కాళేశ్వరంపై కాంగ్రెస్ కుట్ర
బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షురాలు పద్మారెడ్డి
చిన్నశంకరంపేట(మెదక్): కాళేశ్వరం ప్రాజెక్టును అప్రతిష్టపాలు చేసి బనకచర్లకు నీటిని తరలించేందుకు సీఎం రేవంత్‌రెడ్డి కుట్ర చేస్తున్నారని బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షురాలు పద్మారెడ్డి ఆరోపించారు. సోమవారం బీఆర్‌ఎస్ నాయకులతో కలిసి మెదక్– చేగుంట ప్రధాన రహదారిపై రాస్తారోకో చేపట్టి సీఎం రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. అనంతరం అమరవీరుల స్తూపానికి కాళేశ్వరం నీటితో జలాభిషేకం చేశారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. స్థానిక ఎన్నికల్లో గట్టెక్కాలని చూస్తున్న కాంగ్రెస్‌కు ప్రజలు తగిన బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు. పోలీసులు పద్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యే శశిధర్‌రెడ్డిని అరెస్ట్ చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నాయకులు మల్లికార్జున్‌గౌడ్, అంజనేయులు, మాజీ ఏఎంసీ చైర్మన్ గంగా నరేందర్, పీఏసీఎస్ చైర్మన్ అంజిరెడ్డి, రామాయంపేట మాజీ మున్సిపల్ చైర్మన్ జితేందర్‌గౌడ్, మాజీ ఎంపీపీ విజయలక్ష్మి, పట్లోరి రాజు, నాయకులు భారీగా పాల్గొన్నారు.