
ఆ రెండు పార్టీలు కుమ్మక్కు
నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతారెడ్డి
నర్సాపూర్: కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణను సీబీఐకి అప్పగించాలని సీఎం ప్రకటించడాన్ని పరిశీలిస్తే బీజేపీ, కాంగ్రెస్‌లు కుమ్మక్కు అయినట్లు స్పష్టమవుతుందని ఎమ్మెల్యే సునీతారెడ్డి ఆరోపించారు. సోమవారం ఆమె మాట్లాడుతూ.. కాళేశ్వరం గొప్ప ప్రాజెక్టు అని సుప్రీంకోర్టు ప్రశంసించిందని గుర్తు చేశారు. స్థానిక ఎన్నికల కోసం కాంగ్రెస్ ఓట్ల రాజకీయం చేస్తుందని మండిపడ్డారు. శాసనసభలో మంత్రులందరికీ హరీశ్‌రావు ధీటుగా సమాధానం చెప్పారన్నారు. ఘోష్ నివేదికతో ఒరిగేదేమి లేదన్నారు. కాంగ్రెస్ ఎన్ని కుట్రలు చేసినా, ప్రజలు గమనిస్తున్నారని, రాబోయే స్థానిక ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. కేసీఆర్‌కు ప్రజల్లో ఉన్న ఆదరణ చూసి కాంగ్రెస్ భయపడుతుందని ఎద్దేవా చేశారు. సమావేశంలో బీఆర్‌ఎస్ నాయకులు శేఖర్, అశోక్‌గౌడ్, మన్సూర్ పాల్గొన్నారు.