
బోనం.. వైభవం
వెల్దుర్తి(తూప్రాన్): మండలంలోని ఎం.జలాల్‌పూర్ శివారులోని కాళికామాత దేవాలయం వద్ద శ్రావణమాసాన్ని పురస్కరించుకొని ఆదివారం బోనాలు ఊరేగింపు ఘనంగా చేపట్టారు. ఉదయం నుంచే వేద పండితులు హోమం, అర్చనలు, అభిషేకం వంటి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఎమ్మెల్యే సునీతారెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్‌పర్సన్ సుహాసినిరెడ్డి, బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షురాలు పద్మారెడ్డి, కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌చార్జి రాజిరెడ్డితో పాటు పలువురు వేర్వేరుగా ఆలయాన్ని సందర్శించి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.