
బూత్ లెవల్ అధికారుల పాత్ర కీలకం
ఆర్డీఓ రమాదేవి
పాపన్నపేట(మెదక్): ఓటర్ జాబితా తయారీలో బూత్ లెవల్ అధికారులదే కీలక పాత్ర అని మెదక్ ఆర్డీఓ రమాదేవి పేర్కొన్నారు. పాపన్నపేట ఉన్నత పాఠశాలలో మంగళవారం జరిగిన బూత్ లెవల్ అధికారుల శిక్షణ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ...తమకు కేటాయించిన పోలింగ్ స్టేషన్ పరిధిలోని ఇళ్లను సర్వే చేసి, కొత్త ఓటర్లను నమోదు చేయాలని సూచించారు. ఓటరు జాబితాలో తప్పులు ఉంటే,సరిదిద్దాలని చెప్పారు. అన్ని రకాల సమాచారాన్ని యాప్ లో నమోదు చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో తహసీల్దార్ సతీష్, డిప్యూటీ తహసీల్దార్ చరణ్, ఆర్‌ఐ నాగరాజు, మాస్టర్ ట్రైనర్ సత్యానారయణరెడ్డి, వరప్రసాద్, అంజాగౌడ్, నర్సింలు, దేవిసింగ్ పాల్గొన్నారు.