
నేషనల్ వర్క్‌షాప్‌కు కలెక్టర్
మెదక్ కలెక్టరేట్: కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఎర్లీ చైల్డ్ హుడ్ ఎడ్యుకేషన్ (చిన్ననాటి విద్య)పై గురువారం ఢిల్లీలో జరిగిన నేషనల్ వర్క్‌షాప్‌కు కలెక్టర్ రాహుల్‌రాజ్ ప్రత్యేక ఆహ్వానితుడిగా హాజరయ్యారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఢిల్లీలో జరిగిన జాతీయ సమావేశానికి తెలంగాణ నుంచి మహిళా శిశు సంక్షే మ శాఖ సెక్రటరీ అనితా రామచంద్రన్ ప్రత్యేక ఆహ్వానితుడిగా పిలిచారని పేర్కొన్నా రు. రాష్ట్రంలో అంగన్‌వాడీ కేంద్రాల్లో అమలవుతు న్న నూతన కార్యక్రమాలు, పిల్లలకు ప్రైమరీ శిక్షణ, కొత్త యూనిఫాంలు అందించడం, ఇతర పోషణ, శిక్షణకు సంబంధించిన కార్యక్రమా లను సమావేశానికి హాజరైన వివిధ రాష్ట్రాల ప్రతినిధులతో పంచుకున్నానని తెలిపారు.
పాపన్నపేట(మెదక్): పౌర్ణమిని పురస్కరించుకొని గురువారం ఏడుపాయల వన దుర్గమ్మకు పల్లకీ సేవ నిర్వహించారు. అర్చకులు మూల విరాట్టుకు పూజలు నిర్వహించిన అనంతరం ఉత్సవ విగ్రహానికి అర్చన నిర్వహించి పల్లకీ సేవ ప్రారంభించారు. ఆలయం నుంచి గోకుల్‌షెడ్డు వరకు ఊరేగింపు కొనసాగింది. ఆలయ సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.
వన దుర్గమ్మకు
పల్లకీ సేవ

నేషనల్ వర్క్‌షాప్‌కు కలెక్టర్