45కు చేరిన సిగాచీ మృతుల సంఖ్య | - | Sakshi
Sakshi News home page

45కు చేరిన సిగాచీ మృతుల సంఖ్య

Jul 15 2025 12:28 PM | Updated on Jul 15 2025 12:28 PM

45కు

45కు చేరిన సిగాచీ మృతుల సంఖ్య

పటాన్‌చెరు టౌన్‌: ఇస్నాపూర్‌ మున్సిపాలిటీ పరిధిలోని పాశమైలారం పారిశ్రామికవాడలోని సిగాచీ పరిశ్రమలో చోటుచేసుకున్న ప్రమాదంలో 44 మంది మృతదేహాలను కుటుంబ సభ్యులకు అధికారులు అప్పగించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మదినగూడలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వెస్ట్‌ బెంగాల్‌కు చెందిన తుడు తరపాడు (45) సోమవారం ఉదయం మృతి చెందాడు. ఈసందర్భంగా అధికారులు మృతుడి కుటుంబ సభ్యులకు తక్షణ సహాయం కింద రూ. లక్ష అందజేసి, అంబులె న్స్‌ ఏర్పాటు చేసి స్వస్థలానికి పంపించారు. ఈసందర్భంగా అధికారులు మాట్లాడుతూ.. ఇప్పటివరకు 45 మంది కార్మికులు మృతి చెందారని, వివిధ ఆస్పత్రుల్లో 13 మంది చికిత్స పొందుతున్నారని తెలిపారు.

దరఖాస్తుల ఆహ్వానం

నారాయణఖేడ్‌: నిజాంపేట్‌ మండల పరిధిలోని గిరిజన సంక్షేమ మిని బాలికల గురుకులంలో ఔట్‌సోర్సింగ్‌ పద్ధతిన విధులు నిర్వర్తించేందుకు కుక్‌, ఆయా ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు రీజినల్‌ కోఆర్డినేటర్‌ నాగార్జునరావు సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. గిరిజన మహిళా అభ్యర్థులు సంబంధిత ధ్రువీకరణ పత్రాలతో ఈనెల 21 సాయంత్రం 4 గంటలలోగా గురుకులంలో సమర్పించాలని తెలిపారు. టెన్త్‌ విద్యార్హత అని, రూ. 9,750 వేతనం చెల్లిస్తామన్నారు. ఇతర వివరాలకు 7981090652 నంబర్‌లో సంప్రదించాలని సూచించారు.

ఫీజు రీయింబర్స్‌మెంట్‌

ఎత్తివేసేందుకు కుట్ర

జోగిపేట(అందోల్‌): ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకం ఎత్తివేసేందుకు కుట్ర పన్నుతుందని పీడీఎస్‌యూ జిల్లా అధ్యక్షుడు సురేష్‌ అన్నారు. సోమవారం జోగిపేట ఎమ్మార్వో కార్యాలయం ఎదుట విద్యార్థులతో కలిసి ధర్నా నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పెండింగ్‌లో ఉన్న స్కాలర్‌షిప్‌, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు రూ. 7,200 కోట్లు వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. ప్రధానంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులను విద్యకు దూరం చేయాలని ప్రభుత్వం చూస్తుందన్నారు. కార్యక్రమంలో నాయకులు ప్రవీణ్‌, సన్నీ దినేష్‌, మహేష్‌, శ్రీలత, దీపిక, చోటు, మహేశ్వరి తదితరులు పాల్గొన్నారు.

ఏడు మండలాలు..

2,508 రేషన్‌ కార్డులు

నర్సాపూర్‌: నియోజకవర్గంలోని ఏడు మండలాలకు 2,508 కొత్త రేషన్‌కార్డులు వచ్చాయని ఆర్డీఓ మహిపాల్‌ సోమవారం తెలిపారు. వాటిని లబ్ధిదారులకు అందజేస్తామని చె ప్పారు. నర్సాపూర్‌ మండలానికి 354, శివ్వంపేటకు 428, కౌడిపల్లికి 615, కొల్చారానికి 384, మాసాయిపేటకు 249, వెల్దుర్తికి 385, చిలప్‌చెడ్‌ మండలానికి 93 రేషన్‌కార్డులు మంజూరైనట్లు వివరించారు.

ఉపాధ్యాయులకు అవగాహ న

శివ్వంపేట(నర్సాపూర్‌): శాస్త్ర సాంకేతిక రంగాలపై విద్యార్థులు అవగాహన పెంచుకునే విధంగా ఉపాధ్యాయులు కృషి చేయాలని జిల్లా సైన్స్‌ అధికారి రాజిరెడ్డి అన్నారు. సోమవారం శివ్వంపేటలోని పీఎం శ్రీ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో అటల్‌ టింకరింగ్‌ ల్యాబ్‌లపై 12 పాఠశాలలకు సంబంధించి 36 మంది ఉపాధ్యాయులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం జిల్లాలో 25 పాఠశాలల్లో అటల్‌ టింకరింగ్‌ ల్యాబ్‌లను ఏర్పాటు చేసిందన్నారు. ఆయా పాఠశాలల్లో రూ. 10 లక్షల విలువ గల రోబోటిక్స్‌తో పాటు అధునాతన ప్రయోగ పరికరాలను అందజేసిందన్నారు. సైన్స్‌, టెక్నాలజీ, గణితం, ఇంజనీరింగ్‌పై విద్యార్థులు పట్టు సాధించేందుకు ఎంతగానో ఉపయోగపడుతున్నారు. కార్యక్రమంలో ఎంఈఓ బుచ్చనాయక్‌, గెజిటెడ్‌ హెచ్‌ఎం, కోర్స్‌ కోఆర్డినేటర్‌ బాలచంద్రం తదితరులు పాల్గొన్నారు.

45కు చేరిన  సిగాచీ మృతుల సంఖ్య 
1
1/2

45కు చేరిన సిగాచీ మృతుల సంఖ్య

45కు చేరిన  సిగాచీ మృతుల సంఖ్య 
2
2/2

45కు చేరిన సిగాచీ మృతుల సంఖ్య

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement