
బీఎల్‌ఓల పాత్ర కీలకం
నిజాంపేట(మెదక్)/చిలప్‌చెడ్(నర్సాపూర్): ఎన్నికల నిర్వహణలో బీఎల్‌ఓల పాత్ర కీలకమని అదనపు కలెక్టర్ నగేశ్, మెదక్ ఆర్డీఓ రమాదేవి అన్నా రు. నిజాంపేట మండల కేంద్రంలో గురువారం జరిగిన బీఎల్‌ఓల శిక్షణ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. కొత్త ఓటర్ల నమోదు, మార్పులు, చేర్పుల విషయమై అవగాహన కల్పించారు. అలాగే చిలప్‌చెడ్ రైతు వేదికలో బీఎల్‌ఓలకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఈఆర్‌ఓ మహిపాల్‌రెడ్డి పాల్గొని మాట్లాడారు. ఎలాంటి పొరపాట్లు లేకుండా ఓటరు జాబితా తయారు చేయాలన్నారు. కార్యక్రమంలో ఏఈఆర్‌ఓ సహదేవ్, శిక్షకులు శ్రీనివాస్, కొండల్, శివశంకర్, ఆర్‌ఐలు సునీల్, వెంకటేశ్వర్, రెవెన్యూ సిబ్బంది, బీఎల్‌ఓలు పాల్గొన్నారు.