నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు | - | Sakshi
Sakshi News home page

నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు

Jul 11 2025 12:48 PM | Updated on Jul 11 2025 12:48 PM

నకిలీ

నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు

కొల్చారం(నర్సాపూర్‌)/హవేళిఘణాపూర్‌(మెదక్‌): ఫర్టిలైజర్‌ దుకాణదారులు రైతులకు నకిలీ విత్తనాలు అంటగడితే కఠిన చర్యలు ఉంటాయని జిల్లా వ్యవసాయ అధికారి వినయ్‌ కుమార్‌ హెచ్చరించారు. గురువారం మండలంలోని పోతంశెట్టిపల్లిలో పలు దుకాణాలను తనిఖీ చేశారు. స్టాక్‌ రిజిస్టర్లు, బిల్‌ బుక్స్‌, లైసెన్స్‌లను పరిశీలించారు. గడువు తీరిన విత్త నాలు, పురుగుల మందులను రైతులకు అంటగడితే కఠిన చర్యలు ఉంటాయన్నారు. రైతులు దుకాణం నుంచి కొనుగోలు చేసే ప్రతి వస్తువుకు రశీదు తప్పనిసరిగా ఇవ్వాలని ఆదేశించారు. ఏఓ, ఏఈఓలు తరచుగా దుకాణాలను తనిఖీ చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఏఓ శ్వేతకుమారి, ఏఈఓ నిరోషా ఉన్నారు. అనంతరం హవేళిఘణాపూర్‌ రైతు వేదికలో కోరమాండల్‌ ఇంటర్నేషనల్‌ లిమిటెడ్‌ నానో ఫెర్టిలైజర్స్‌పై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో పాల్గొన్నారు.

‘సబ్‌స్టేషన్‌

మంజూరు చేయాలి’

మెదక్‌జోన్‌: పట్టణంలో విద్యుత్‌ సమస్యలు ఉత్పన్నం అవుతున్నందున జిల్లా కేంద్రానికి 33/11 కేవీ సబ్‌స్టేషన్‌తో పాటు 25 ట్రాన్స్‌ఫార్మర్లు మంజూరు చేయాలని మాజీ ఎమ్మెల్యే శశిధర్‌రెడ్డి గురువారం డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కకు గురువారం లేఖ రాశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గడిచిన పదేళ్లలో పట్టణ విస్తీర్ణం బాగా పెరిగినందున, ప్రస్తుతం ఉన్న సబ్‌స్టేషన్‌తో సమస్యలు వస్తున్నాయని, సబ్‌స్టేషన్‌ మంజూరు చేసి సమస్యలు తీర్చాలని లేఖలో కోరారు.

ప్రభుత్వ కాలేజీల్లో

మెరుగైన బోధన

శివ్వంపేట(నర్సాపూర్‌): ప్రభుత్వ కాలేజీల్లో విద్యార్థులకు మెరుగైన బోధన అందుతుందని ఉమ్మడి జిల్లా ఇంటర్మీడియెట్‌ ప్రత్యేక అధికారి కిషన్‌ అన్నారు. గురువారం శివ్వంపేటలోని జూనియర్‌ కాలేజీని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈసందర్భంగా కాలేజీ స్థితిగతులు, విద్యార్థుల ప్రవేశాలు, బోధన గురించి అడిగి తెలుసుకున్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. త్వరలోనే శివ్వంపేట జూని యర్‌ కాలేజీకి సంబంధించి సొంత భవన నిర్మాణానికి నిధులు మంజూరు అవుతాయన్నారు. ప్రభుత్వ కాలేజీల్లో ప్రతిభ కలిగిన అధ్యాపకులచే బోధన అందిస్తామని, విద్యార్థులు శ్రద్ధగా చదువుకొని ఉన్నతస్థాయికి ఎదగాల్సిన అవసనరం ఉందన్నారు. అనంతరం ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు సన్మానించి అభినందించారు. కార్యక్రమంలో కాలేజీ అధ్యాపకులు, సిబ్బంది ఉన్నారు.

బీఆర్‌ఎస్‌ నేతలకు

అహంకారం

మెదక్‌ మున్సిపాలిటీ: మెదక్‌ ప్రజల మనోభావాలు దెబ్బతీసేలా మాట్లాడిన కేటీఆర్‌ బహిరంగ క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్‌ నేతలు మాజీ మున్సిపల్‌ చైర్మన్‌ తొడుపునూరి చంద్రపాల్‌, ప్రభాకర్‌రెడ్డి, రాజిరెడ్డి డిమాండ్‌ చేశారు. ఈ మేరకు కేటీఆర్‌పై చర్యలు తీసుకోవాలని ఎస్పీ డీవీ శ్రీనివాస్‌రావును కలిసి ఫి ర్యాదు చేశారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. అధికారం పోయినా బీఆర్‌ఎస్‌ నేతలకు అహంకారం తగ్గలేదన్నారు. జిల్లా ప్రజలను కేటీఆర్‌ గాడిదలతో పోల్చడం సరికాదన్నా రు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు తగిన బుద్ధి చెబుతామన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు శ్రీనివాస్‌చౌదరి, బొజ్జ పవన్‌, లక్కర్‌ శ్రీనివాస్‌ ఆంజనేయులుగౌడ్‌, ముత్యంగౌడ్‌, గంగాధర్‌, రాగి అశోక్‌, లల్లూ, లక్ష్మీనారాయణ, దుర్గప్రసాద్‌, మహేందర్‌రెడ్డి, శంకర్‌, లింగం, శ్రీకాంత్‌, కృష్ణ, రమేష్‌ గౌడ్‌, బానీ తదితరులు పాల్గొన్నారు.

నకిలీ విత్తనాలు  అమ్మితే కఠిన చర్యలు  
1
1/2

నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు

నకిలీ విత్తనాలు  అమ్మితే కఠిన చర్యలు  
2
2/2

నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement