
వైభవంగా గురుపౌర్ణమి
జిల్లావ్యాప్తంగా గురుపౌర్ణమి వేడుకలను ప్రజలు వైభవంగా నిర్వహించారు. గురువారం ఉదయం నుంచే సాయిబాబాను దర్శించుకోవడానికి ఆలయాలకు పోటెత్తారు. దీంతో ఆలయాల వద్ద భక్తుల సందడి నెలకొంది. భక్తులకు నిర్వాహకులు అన్నప్రసాద వితరణ చేపట్టారు. పాఠశాలల్లో వ్యాసమహర్షి జయంతిని నిర్వహించారు. విద్యార్థులు గురువులను సన్మానించారు. కొల్చారం మండలంలోని రంగంపేట ఆశ్రమంలో గురు పౌర్ణమి వేడుకలకు ఎంపీ రఘునందన్‌రావు, ఎమ్మెల్యే సునీతారెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఆశ్రమ పీఠాధిపతి మాధవానంద సరస్వతి ఆశీస్సులు తీసుకున్నారు. వారి వెంట బీజేపీ జిల్లా అధ్యక్షుడు మల్లేశంగౌడ్, డీసీఎంఎస్ వైస్ చైర్మన్ రమేష్ కుమార్, నాయకులు తదితరులు ఉన్నారు.
– వెల్దుర్తి(తూప్రాన్)/కొల్చారం (నర్సాపూర్)

వైభవంగా గురుపౌర్ణమి

వైభవంగా గురుపౌర్ణమి