
ఆర్వోబీ నిర్మాణానికి రూ. 45 కోట్లు
చేగుంట(తూప్రాన్): మెదక్– చేగుంట రోడ్డులో రైల్వేగేటు వద్ద ఆర్వోబీ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం రూ. 45 కోట్లు మంజూరు చేసిందని మెదక్ ఎంపీ రఘునందన్‌రావు తెలిపారు. సోమవారం చేగుంట ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్‌లో విలేకరులతో మాట్లాడారు. దుబ్బాక ఉపఎన్నికలో ఇచ్చిన హామీ మేరకు రెడ్డిపల్లి చౌరాస్తా వద్ద ఫ్లై ఓవర్ నిర్మించి ప్రమాదాలను నివారించినట్లు చెప్పారు. ఎంపీ ఎన్నికల్లో చేగుంట రైల్వేగేటు వద్ద ఆర్వోబీ నిర్మాణానికి హామీ ఇచ్చినట్లు పేర్కొన్నారు. ఆర్వోబీ నిర్మాణానికి రాష్ట్ర వాటా నిధులను కేటాయించాలని కేంద్రం కోరగా, ఇవ్వలేమని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కేంద్రానికి లేఖ రాశారన్నారు. రాష్ట్ర వాటా లేకున్నా వందశాతం కేంద్రం నిధులను మంజూరు చేయించినట్లు వివరించారు. ఇప్పటికే టెండర్ ప్రక్రియ పూర్తయిందని, రెండు వారాల్లో నిర్మాణ పనులకు శంకుస్థాపన చేస్తామన్నారు. 18 నెలల్లో బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేయించి రైల్వేగేటు వద్ద ట్రాఫిక్ అంతరాయం లేకుండా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో బీజేపీ మండల శాఖ అధ్యక్షుడు ఎల్లారెడ్డి, నాయకులు నాగవేందర్‌రెడ్డి, భూపాల్, సంతోష్‌రెడ్డి, గణేష్, రవికుమార్, రఘువీర్‌రావు, నాగభూషణం, సాయిబాబా, హరిశంకర్ తదితరులు పాల్గొన్నారు.
మెదక్ ఎంపీ రఘునందన్‌రావు