
● నీరంతా వృథా.. పట్టని వ్యధ
మండల కేంద్రమైన పాపన్నపేటలో మూడు రోజులుగా మిషన్ భగీరథ నీరు వృథాగా పోతున్నా పట్టించుకునే నాథుడు కరువయ్యాడు. మండల కార్యాలయం ఎదుట తాగు నీటి పైపులైన్ పగిలిపోవడంతో నీరు వరదలా పారుతోంది. దీంతో దిగువన ఉన్న ప్రజలు నీరందక అవస్థలు పడుతున్నారు. ఈ విషయాన్ని పలువురు గ్రామస్తులు సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లినా, పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వారం రోజుల క్రితం నార్సింగి శివారులో కూడా మిషన్ భగీరథ పైపులైన్ పగిలిపోయింది. ఇప్పటికై నా అధికారులు స్పందించి నీటి వృథాను అరికట్టాలని కోరుతున్నారు. – పాపన్నపేట(మెదక్)