
రెండేళ్లుగా ఇదే గోస
మెదక్ మండలం రాయిన్‌పల్లి శివారులో 21 గుంటల పట్టా భూమి ఉంది. ఆ భూమిని మా నాన్న నుంచి నాకు వారసత్వంగా వచ్చింది. సాగు చేసుకుంటూ కాస్తులో ఉన్నాం. పాత పట్టాదార్ పాస్ పుస్తకంలో పట్టా అని ఉంది. 2018లో ఇచ్చిన కొత్త పాస్ పుస్తకంలో పట్టా భూమిని లావణి పట్టా అని పడింది. పాస్ పుస్తకాన్ని అప్పట్లో గమనించలేదు. రెండేళ్ల క్రితం అప్పుకోసం బ్యాంకుకు వెళ్లగా అక్కడ అధికారులు చెప్పారు. నాటి నుంచి ప్రతి ప్రజావాణిలో వినతులు అందజేస్తున్నా, ఇప్పటివరకు అధికారులు సరైన సమాధానం చెప్పడం లేదు.
గణపురం భిక్షపతి, మక్తభూపతిపూర్, మెదక్