డంపింగ్‌ యార్డ్‌ రద్దు చేయాలి | - | Sakshi
Sakshi News home page

డంపింగ్‌ యార్డ్‌ రద్దు చేయాలి

Mar 28 2025 6:17 AM | Updated on Mar 28 2025 6:15 AM

సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు చుక్కా రాములు

సంగారెడ్డి ఎడ్యుకేషన్‌: ప్రజా వ్యతిరేకమైన ప్యారానగర్‌ డంపింగ్‌ యార్డ్‌ రద్దు చేయాల్సిందేనని, రేవంత్‌రెడ్డి సర్కార్‌ ప్రజా ప్రభుత్వం అంటూనే ప్రజల గోడు పట్టించుకోరా అని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు చుక్కా రాములు ప్రశ్నించారు. ప్యారానగర్‌ డంపింగ్‌ యార్డు వ్యతిరేక పోరాటానికి మద్దతుగా గురువారం సీపీఎం సామూహిక నిరహార దీక్షలను ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు చుక్కా రాములు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...ప్రజా ఉద్యమాలను నిర్బంధాలతో అణచివేయాలని చూస్తే ప్రజలు మరింత తిరగబడతారని హెచ్చరించారు. స్థానిక ప్రజల అభిప్రాయాలకు భిన్నంగా ఏకపక్షంగా డంపింగ్‌యార్డ్‌ పెట్టాలని నిర్ణయించడం సరైంది కాదన్నారు. డంపింగ్‌ యార్డ్‌ను రద్దు చేయాలని కోరుతూ ప్రజలు పోరాడుతున్నందున వాస్తవ పరిస్థితులను గమనించి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాల్సిన బాధ్యత జిల్లా కలెక్టర్‌పై ఉందన్నారు. ప్యారానగర్‌–నల్లవల్లిలో డంపింగ్‌యార్డ్‌ పెడితే ఆ ప్రాంతమంతా కాలుష్య కోరల్లో చిక్కి ప్రజలు జీవించే పరిస్థితి లేకుండా పోతుందన్నారు. ఇప్పటికే పరిశ్రమలు వెదజల్లే కాలుష్యం వల్ల జిన్నారం, బొంతపల్లి,పటాన్‌చెరు ప్రాంతమంతా పరిసరాలు, పర్యావరణం దెబ్బతినడం వల్ల అక్కడ ప్రజలు జీవించలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం డంపింగ్‌ యార్డును రద్దు చేయాలని కోరుతూ కలెక్టరేట్‌ ఏఓకు వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి జయరాజు, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు మల్లేశం, రాజయ్య, మాణిక్యం, సాయిలు, నర్సింహులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement