
మానవతా దృక్పథంతో పరిష్కరించాలి
దివ్యాంగుల సమస్యలపై కలెక్టర్ రాహుల్‌రాజ్
మెదక్ కలెక్టరేట్: దివ్యాంగుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను మానవతా దృక్పథంతో పరిష్కరించాలని కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా సీ్త్ర శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో దివ్యాంగుల ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్.. స్వయంగా దివ్యాంగుల వద్దకు వెళ్లి సమస్యలను అడిగి తెలుసుకుంటూ ఫిర్యాదులు స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా నిర్వహిస్తున్న ప్రజావాణికి విశేష స్పందన లభిస్తుందన్నారు. దివ్యాంగుల నుంచి ప్రజావాణిలో స్వీకరించిన దరఖాస్తులను సత్వర న్యాయం జరిగే దిశగా చర్యలు చేపడతామన్నారు. వివిధ సమస్యలపై 23 దరఖాస్తులు వచ్చాయని, వాటిని సత్వరంగా పరిష్కరించేలా కృషి చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ శ్రీరామ్ పాల్గొన్నారు.
చివరి ఆయకట్టుకు నీరు
పాపన్నపేట(మెదక్): ఫతే నహర్ కెనాల్ కింద చివరి ఆయకట్టుకు నీరు అందేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. మంగళవారం ఆయన పాపన్నపేట మండల పరిధిలోని శానాయపల్లి, పొడిచన్‌పల్లి గ్రామాల చివరి ఆయకట్టును పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడుతూ..నీటి లభ్యత, కరెంట్ సరఫరా తీరును అడిగి తెలుసుకున్నారు. ఘనపురం ఆనకట్ట నుంచి ఇంకా ఎన్ని తడులు అవసరమవుతాయని, సన్న వరి ఎన్ని ఎకరాలు వేశారని అధికారులను అడిగారు. ఆయన వెంట ఏఇ విజయ్ ఉన్నారు.