మెనూ ప్రకారం భోజనం పెట్టాలి: డీఎల్‌పీఓ | - | Sakshi
Sakshi News home page

మెనూ ప్రకారం భోజనం పెట్టాలి: డీఎల్‌పీఓ

Mar 12 2025 9:09 AM | Updated on Mar 13 2025 1:00 PM

కౌడిపల్లి(నర్సాపూర్‌): మండలంలోని వెల్మకన్నలోని ఎస్సీ బాలుర హాస్టల్‌ను డీఎల్‌పీఓ సాయిబాబా మంగళవారం ఆకస్మిక తనిఖీ చేశారు. హాస్టల్‌లో కిచెన్‌రూం, హాస్టల్‌ గదులు, టాయిలెట్స్‌, ఇతర పరిసరాలను పరిశీలించారు. విద్యార్థుల హాజరు రిజిస్టర్‌, మెనూ ప్రకారం భోజనం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థుల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ప్రతీరోజు మెనూ ప్రకారం విద్యార్థులకు నాణ్యమైన భోజనం వండి పెట్టాలన్నారు. హాస్టల్‌ విద్యార్థులకు ఉదయం, రాత్రి స్టడీ అవర్‌ నిర్వహించాలని, సమస్యలుంటే చెప్పాలన్నారు. కార్యక్రమంలో వసతి గృహ సంక్షేమ అధికారి జయరాజ్‌, వెల్మకన్న, కొట్టాల పంచాయతీ కార్యదర్శులు ప్రవీణ్‌రెడ్డి, మల్లేశం తదితరులు పాల్గొన్నారు.

చదవడం, రాయడం రావాలి
ఎఫ్‌ఎల్‌ఎన్‌ జిల్లా కోఆర్డినేటర్‌ సిరి

కౌడిపల్లి(నర్సాపూర్‌): ప్రతీ విద్యార్థికి చదవడం, రాయడం రాయాలని ఎఫ్‌ఎల్‌ఎన్‌ (ఫండమెంటల్‌ లిటరసీ అండ్‌ న్యూమరసీ) జిల్లా కోఆర్డినేటర్‌ సిరి అన్నారు. మంగళవారం కౌడిపల్లి, దేవులపల్లి ప్రాథమిక పాఠశాలను ఎంఈఓ బాలరాజుతో కలిసి సందర్శించారు. ఆయా పాఠశాలలో మధ్యాహ్న భోజనం, పాఠశాల రికార్డులు, ఉపాధ్యాయులు, విద్యార్థుల హాజరు పరిశీలించారు. విద్యార్థుల సామర్థ్యాలను పరీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రతీ విద్యార్థికి చతుర్విద ప్రక్రియలు చదవడం, రాయడం, కూడికలు, గుణితం కచ్చితంగా రావాలన్నారు. అనంతరం ఎంఈఓ బాలరాజు మాట్లాడుతూ.. ఉపాధ్యాయులు సమయపాలన పాటించి విద్యార్థులకు నాణ్యమైన విద్య, భోజనం అందించాలని తెలిపారు. పాఠశాల పరిసరాలు, బాత్‌రూంలు, మరగుదొడ్లు శుభ్రంగా ఉంచాలని చెప్పారు. సమస్యలుంటే చెప్పాలని, విధులపై నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవన్నారు.

ఎమ్మెల్సీ సుభాష్‌రెడ్డి పూజలు
పాపన్నపేట(మెదక్‌): ఎమ్మెల్సీ సుభాష్‌రెడ్డి మంగళవారం ఏడుపాయల దుర్గమ్మను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అర్చకులు శంకరశర్మ, పార్థివశర్మ ఆయనకు ఆలయ మర్యాదల ప్రకారం స్వాగతం పలికారు. అర్చన నిర్వహించి, తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం ఈఓ చంద్రశేఖర్‌ శాలువాతో సత్కరించారు.

విజయసేనారెడ్డికి 259వ ర్యాంకు
చేగుంట(తూప్రాన్‌): మండలంలోని బీకొండాపూర్‌కు చెందిన విజయసేనారెడ్డి గ్రూప్‌–2 ఫలితాల్లో 259వ ర్యాంకు సాధించారు. మండలంలోని మక్కరాజీపేట ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్నారు. మంచి ర్యాంకు సాధించిన విజయసేనారెడ్డిని ఉపాధ్యాయ సంఘాల నాయకులు, స్నేహితులు అభినందించారు. ఐదేళ్ల కఠోర దీక్షకు తగిన ఫలితం వచ్చిందని విజయసేనారెడ్డి సంతోషం వ్యక్తం చేశారు.

గ్రూప్‌ 2లో 103వ ర్యాంక్‌
హుస్నాబాద్‌: పట్టణానికి చెందిన అయిలేని మణికంఠేశ్వర్‌ రెడ్డి గ్రూప్‌ 2లో స్టేట్‌ ర్యాంక్‌ సాధించారు. గ్రూప్‌ 2లో 392.5 మార్కులు వచ్చాయి. గతంలో గ్రూప్‌ 4లో 600 ర్యాంక్‌ సాధించిన మణికంఠేశ్వర్‌ రెడ్డి ప్రస్తుతం రంగారెడ్డి జిల్లా ఎండోమెంట్‌ కార్యాలయంలో జూనియర్‌ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్నారు.

ఆదర్శలో ప్రవేశానికి గడువు పెంపు
చిన్నకోడూరు(సిద్దిపేట): ఆదర్శ పాఠశాలలో ఈ విద్యా సంవత్సరం ప్రవేశాలకు దరఖాస్తు గడువు ఈ నెల 20 వరకు పొడిగించినట్లు ఇబ్రహీంనగర్‌ మోడల్‌ స్కూల్‌ ప్రిన్సిపాల్‌ సతీష్‌ తెలిపారు. 6వ తరగతిలో ప్రవేశం పొందే విద్యార్థులతో పాటు 7, 8, 9, 10 తరగతుల్లో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి ఏప్రిల్‌ 20న ప్రవేశ పరీక్ష ఉంటుందన్నారు. మరిన్ని వివరాలకు ఆదర్శ పాఠశాలలో సంప్రదించాలన్నారు.

మెనూ ప్రకారం భోజనం పెట్టాలి: డీఎల్‌పీఓ  1
1/2

మెనూ ప్రకారం భోజనం పెట్టాలి: డీఎల్‌పీఓ

మెనూ ప్రకారం భోజనం పెట్టాలి: డీఎల్‌పీఓ  2
2/2

మెనూ ప్రకారం భోజనం పెట్టాలి: డీఎల్‌పీఓ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement