పకడ్బందీగా విధులు నిర్వర్తించాలి | - | Sakshi
Sakshi News home page

పకడ్బందీగా విధులు నిర్వర్తించాలి

Sep 18 2026 1:57 AM | Updated on Sep 18 2026 1:57 AM

చెన్నూర్‌: ప్రతీ పోలీసు పకడ్బందీగా విధులు నిర్వర్తించాలని, గణేశ్‌ నిమజ్జనంలో అవాంఛనీయ ఘటనలకు చోటివ్వకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని మంచిర్యాల డీసీపీ భాస్కర్‌ అన్నారు. గురువారం చెన్నూర్‌ పోలీసుస్టేషన్‌ను సందర్శించి పరిసరాలు, రికార్డులు పరిశీలించారు. అనంతరం పెద్ద చెరువు నిమజ్జన ఘాట్‌ను సందర్శించి రూట్‌ మ్యాప్‌ అడిగి తెలుసుకున్నారు. డీసీపీ మాట్లాడుతూ జిల్లాలో 2800 గణేష్‌ మండళ్లు ఏర్పాటు చేశారని, విగ్రహాలు ఒకేసారి కలిసి రాకుండా ఒకదాని తర్వాత ఒకటి వచ్చేలా చర్యలు చేపట్టాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జైపూర్‌ ఏసీపీ వెంకటేశ్వర్‌, సీఐ బన్సీలాల్‌ సీఐ, ఎస్సైలు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement