మంచిర్యాలఅర్బన్: బాల్యం నుంచే శాసీ్త్రయ దృక్పథం పెంచుకోవాలని జిల్లా విద్యాశాఖాధికారి చంద్రయ్య అన్నారు. గురువారం జిల్లా సైన్స్ సెంటర్‌లో విశ్వేశ్వరయ్య పారిశ్రామిక సాంకేతిక మ్యూజియం(వీఐటీఎం) బెంగళూర్ ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ సెమినార్ పోటీల్లో ఆయన మాట్లాడారు. జిల్లాలో 50 పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు. సైన్స్ సెమినార్‌లో సాయిశ్రీ రిషిత(ప్రథమ), లింగంపల్లి అక్షర(ద్వితీయ), గ్రీష్మసింగ్(తృతీయ) విజేతలుగా నిలిచారు. జిల్లా సైన్స్ అధికారి రాజగోపాల్, అసిస్టెంట్ ప్రొఫెసర్ గంగయ్య, కుమారస్వామి, శ్రీనివాస్ పాల్గొన్నారు.
ఏక్ పేడ్ మా కే నామ్
జిల్లాలో 22, 23న ఏక్‌పేడ్ మా కే నామ్ ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని డీఈవో చంద్రయ్య అన్నారు. ప్రతీ పాఠశాల నుంచి తల్లితో మొక్కు నాటుతున్న ఒక చిత్రాన్ని అప్‌లోడ్ చేయాలని సూచించారు.
‘జ్ఞాన భారతం’ విజయవంతం చేయాలి
మంచిర్యాలఅగ్రికల్చర్: జ్ఞాన భారతం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ చంద్రయ్య అన్నారు. గురువారం అదనపు కలెక్టర్ చాంబర్‌లో జ్ఞాన భారతం జిల్లా స్థాయి కో ఆర్డినేటర్ కమిటీ అధికారులు, విద్యాశాఖ అధికారులతో సమీక్షించారు. అదనపు కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని పురాతన గ్రంథాలు, తాళప్రత గ్రంథాలు భద్రపరిచే ప్రక్రియ చేపట్టినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు, జిల్లా సంక్షేమ శాఖ అధికారులు నీరటి రాజేశ్వరి, ఇంటర్మీడియెట్ విద్యాధికారి అంజయ్య, తదితరులు పాల్గొన్నారు.
ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలి
మంచిర్యాలఅర్బన్: దివ్యాంగ విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో నైపుణాల్యలు పెంచుకుంటూ ముందుకు సాగాలని జిల్లా అదనపు కలెక్టర్, డీఈవో చంద్రయ్య తెలిపారు. గురువారం స్థానిక జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల ప్రాంగణంలోని భవిత సెంటర్ వద్ద సమగ్రశిక్ష, అలింకో సంయుక్త ఆధ్వర్యంలో దివ్యాంగ విద్యార్థులకు ఉపకరణ పరికరాల నిర్ధారణ, గుర్తింపు శిబిరం నిర్వహించారు. వివిధ మండలాల నుంచి 113 మంది విద్యార్థులు హాజరయ్యారు. అర్హులకు విద్యాసంవత్సరం చివరిలో ఉపకరణాలు అందజేస్తామని డీఈవో తెలిపారు. కమ్యూనిటీ మొబిలైజింగ్ ఆఫీసర్ కృష్ణమూర్తి, జిల్లా సైన్స్ అధికారి రాజగోపాల్, జిల్లా పరీక్షల విభాగం సహాయ కమిషనర్ మల్లేశం, ఎంఈవో మాళవీదేవి పాల్గొన్నారు.


