మంచిర్యాలఅగ్రికల్చర్: ప్రజా పాలనలో అభివృద్ధి, ఉద్యోగ, ఉపాధి, సంక్షేమ పథకాలు ప్రజలకు అందించడంలో ప్రభుత్వం ముందంజలో ఉందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాల్‌రావు అన్నారు. అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు ఇస్తోందని, మహిళలను కోటీశ్వర్లను చేయడమే లక్ష్యమని, విద్యుత్, నీటిపారుదల, వ్యవసాయం, పరిశ్రమలు, ఉద్యోగ, ఉపాధి కల్పన, సంక్షేమ కార్యక్రమాల అమలులో దేశానికి ఆదర్శంగా నిలుస్తోందని తెలిపారు. గురువారం ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా జిల్లా కలెక్టరేట్ ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. అంతకు ముందు పోలీసు గౌరవందనం స్వీకరించి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. మహాలక్ష్మి, గృహజ్యోతి, రైతుభరోసా, రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాలు, రేషన్ బియ్యం పంపిణీ తదితర వాటి ద్వారా ప్రజలకు చేకూరుతున్న లబ్ధిపై వివరించారు. జిల్లా అభివృద్ధిపై ప్రసంగం ఆయన మాటల్లోనే..
ఇందిరా మహిళ శక్తి..
స్వయం సహాయక సంఘాల మహిళలకు ఆర్థిక చేయూత అందించాం. జిల్లాలో 16 మండలాలకు 16 బస్సులతోపాటు జిల్లా మహిళా సమాఖ్యకు ఒక బస్సు మంజూరు చేసి అదనపు ఆదాయం సమకూర్చడం జరుగుతోంది. వడ్డీ లేని రుణాల పథకం కింద ఇప్పటి వరకు 8,817 సంఘాలకు రూ.23.90 కోట్లు అందించాం. జిల్లా కేంద్రంలో రూ.5 కోట్లు అంచనా వ్యయంతో ఇందిరా మహిళా శక్తి భవనం నిర్మాణం చేపట్టగా పనులు తుది దశలో ఉన్నాయి. ఒక్కో మహిళా సమాఖ్య భవనానికి రూ.10 లక్షల చొప్పున 269 భవనాలకు రూ.26.90 కోట్లు మంజూరు చేయగా పనులు కొనసాగుతున్నాయి.
వైద్య రంగం..
జిల్లా కేంద్రంలో సూపర్ స్పెషాలి టీ ఆసుపత్రి నిర్మాణం రూ.300 కోట్ల తో జరుగుతోంది. రూ.23.75 కోట్లతో 50 పడకల క్రిటికల్ కేర్ ఆసుపత్రి, రూ. 129.25 కోట్లతో ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణం జరుగుతున్నాయి. చెన్నూర్‌లో 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి రూ.31.15 కోట్లతో నిర్మాణం పూర్తయి ప్రారంభానికి సిద్ధంగా ఉంది. జిల్లాలో 14 ఏళ్లు నిండిన 1,248 మంది బాలికలకు గర్భాశయ ముఖద్వారా క్యాన్సర్ రాకుండా హెచ్‌పీవీ వ్యాక్సిన్ అందించాం.
– ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కుమార్‌దీపక్, డీసీపీ ఎగ్గడి భాస్కర్, జిల్లా అదనపు కలెక్టర్లు చంద్రయ్య, రాములు, అటవీశాఖ అధికారి రాహుల్ కిషన్, ట్రెయినీ డిప్యూటీ కలెక్టర్ విలాయత్ అలీ, బెల్లంపల్లి సబ్‌కలెక్టర్ మనోజ్, కనీస వేతన మండలి చైర్మన్ జనక్‌ప్రసాద్, మంచిర్యాల నగర మేయర్ ధర్ని మధుకర్, డిప్యూటీ మేయర్ సల్ల రమ్య పాల్గొన్నారు.
ఇందిరమ్మ ఇళ్లు
విద్యాశాఖ
జిల్లాలో ఇప్పటివరకు 10,830 ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యాయి. 8,577 ఇళ్లు గ్రౌండింగ్ చేయగా.. 1,474 బేస్‌మెంట్, 846 స్లాబ్ లెవల్ వరకు గోడలు పూర్తయ్యాయి. 2,506 ఇళ్లు నిర్మాణ స్థాయిలో ఉన్నాయి. 2,744 ఇళ్లు పూర్తయి ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి. లబ్ధిదారుల ఖాతాల్లో రూ.207.96 కోట్లు జమ చేశాం. 1,656 డబుల్ బెడ్‌రూం ఇళ్లు మంజూరయ్యాయి. 1,314 నిర్మాణం పూర్తి కాగా 1,254 మంది లబ్ధిదారులకు కేటాయించగా మరో 60 మంది ఎంపిక కొనసాగుతోంది.
జిల్లా గురుకుల విద్యాసంస్థల్లోని 32 మంది విద్యార్థులు జాతీయ స్థాయి క్రీడాపోటీలకు ఎంపికై జిల్లా ఖ్యాతిని రాష్ట్ర వ్యాప్తంగా చాటారు. కేజీబీవీలు, తెలంగాణ మోడల్ స్కూళ్లలో మౌలిక వసతుల కల్పనకు రూ.21.20 కోట్లు మంజూరు చేయగా పనులు పురోగతిలో ఉన్నాయి. మూడు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ల నిర్మాణానికి రూ.200 చొప్పున మంజూరు చేయగా దండేపల్లి మండలం రెబ్బెనపల్లి, చెన్నూర్ మండలం సోమనపల్లి, బెల్లంపల్లిలో శంకుస్థాపన చేశాం.


